బీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేయవచ్చని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయడాన్ని ఆయన స్వాగతించారు.
హైదరాబాద్: బీఆర్ ఎస్ ఎక్కడైనా పోటీ చేయవచ్చని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆదివారంనాడు చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ జాతీయ వాదంతో బీఆర్ఎస్ గా మారిందన్నారు. ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా ఆ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిందన్నారు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చని చెప్పారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ విషయమై మీడి యా ప్రతినిధులు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ స్వాగతించారు.
ఏపీకి చెందిన కొందరు నేతలు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ లో చేరారు. సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను ప్రకటించారు . ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలు అప్పగింనున్నారు కేసీఆర్. ఢిల్లీ కేంద్రంగా రావెల కిషోర్ బాబుకు పార్టీ బాధ్యతలను కేసీఆర్ అప్పగించే అవకాశం ఉంది.
also read:పోలీసులు నిస్తేజంగా ఉంటే శాంతి భద్రతల సమస్య: పవన్ కళ్యాణ్
దేశంలో పార్టీని విస్తరించాలనే లక్ష్యంతో కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఈ మేరకు పార్టీ పేరును మార్చారు . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో ఏర్పాటైన టీఆర్ఎస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. సంక్రాంతి తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కమిటీలను కేసీఆర్ ప్రకటించనున్నారు.