జగన్ ‘అత్తగారింటికి’ వెళ్ళారట..వివాదాస్పద వ్యాఖ్యలు

First Published Nov 10, 2017, 1:48 PM IST
Highlights
  • వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఈనెల 6వ తేదీ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు శుక్రవారం వారం కదా పాదయాత్రకు విరామిచ్చిన జగన్ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల  కేసులో విచారణ నిమ్మితం జగన్ నెలలో ఓ శుక్రవారం కోర్టుకు హజరవ్వాలి. అందులో భాగంగానే పాదయాత్రకు విరామిచ్చి హైదరాబాద్ లోని సిబిఐ కోర్టుకు వచ్చారు.  

ఫిరాయింపు మంత్రి అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ పాదయాత్రకు విరామం ఇచ్చి అత్తవారింటికి(కోర్టుకు)వెళ్ళారంటూ సెటైర్ వేసారు. పాదయాత్ర మొదలవ్వక ముందు నుండి  మంత్రులు, పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు జనాల స్పందన బాగుండటంతో మంత్రులు తమ విమర్శలు, ఆరోపణల జోరును కూడా మరింత పెంచుతున్నారు. తాజాగా ఆదినారాయణరెడ్డి జగన్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ, సభలకు, పెళ్లిళ్లకు వచ్చే జనాలు ఎన్నికల్లో ఓట్లు వెయ్యరని వ్యాఖ్యానించారు. 

పోయిన ఎన్నికలకు ముందు బొత్స, రఘువీరా రెడ్డి  తమ పిల్లల వివాహాలను భారీ ఎత్తున జరిపారని గుర్తు చేశారు. అంతేకాదు జనం కూడా పెద్ద సంఖ్యలోనే ఆ పెళ్లిళ్లకు హాజరయ్యారు. అయితే, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ ఇద్దరి నేతలకి డిపాజిట్ కూడా రాలేదని వ్యంగ్యంగా అన్నారు.

జగన్ ప్రస్తుతం పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చారని చెప్పుకొచ్చారు.. ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు బాగుందన్నారు. ప్రతిపక్ష వైసీపీ వైరస్ లాంటిదన్నారు. వైరస్ లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో సభలో వైసీపీ లేకపోవడం అలానే ఉందని వ్యాఖ్యానించారు. జగన్‌ను ఇలానే వదిలేస్తే తెలంగాణకు షర్మిల సీఎం అవుతారని, విజయమ్మను రాష్ట్రపతి చేస్తానని జగన్ చెబుతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

click me!