వైసిపి లేకుండానే అసెంబ్లీ సమావేశాలు

First Published Nov 10, 2017, 10:15 AM IST
Highlights
  • ప్రతిపక్షం లేకుండా కేవలం అధికారపార్టీ సభ్యులతోనే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి.

ప్రతిపక్షం లేకుండా కేవలం అధికారపార్టీ సభ్యులతోనే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం మొదలైన అసెంబ్లీ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం వైసీపీ బహిష్కరించిన సంగతి అందరకీ తెలిసిందే. చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తున్న ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. దాంతో ఈరోజు మొదలైన సమావేశాల్లో కేవలం అధికారపార్టీ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. దాంతో చంద్రబాబు భజనకు అంతు లేకుండా పోయింది.

ప్రశ్నోత్తరాలతో మొదలైన సమావేశాల్లో నీటి పారుదల ప్రాజెక్టులుపై సభ్యులు ప్రశ్నలు అడిగిన ప్రశ్నలకు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమాధానాలిచ్చారు. పోలవరం ప్రాజెక్టు అవసరం, కృష్ణా డెల్టా రైతుల సమస్యల పరిష్కారం, పట్టిసీమ వల్ల అదనంగా వచ్చిన సాగుబడి తదితర అంశాలపై సభ్యులు మాట్లాడారు. అంతేకాకుండా పలు ప్రశ్నలు కూడా వేసారు. ప్రతిపక్షం లేకపోవటంతో సభ్యులు వేసిన అన్నీ ప్రశ్నలకు మంత్రులు కూడా సుదీర్ఘంగా సమాధానాలిస్తున్నారు.

తమ పార్టీ తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని, ఫిరాయింపు మంత్రులను వెంటనే మంత్రివర్గం నుండి తొలగిచాలనే డిమాండ్ తో వైసీపీ సమావేశాలను బహిష్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. అయతే, వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా ఏదో మొక్కుబడిగా పిలుపిచ్చారు. ఎందుకంటే, ఫిరాయింపులపై స్పీకర్ వేటు వేసేది లేదు, వైసీపీ సభకు వచ్చేది లేదన్న విషయం ఎప్పుడో స్పష్టమైపోయింది. ఎటూ వైసీపీ సభ్యులు సభకు రారని తెలిసే స్పీకర్ వారితో మాట్లాడారు. అనుకున్నట్లే సభకు రావటానికి ప్రతిపక్షం నిరాకరించింది. దాంతో సమావేశాలు ఏకపక్షంగా సాగుతోంది.

 

click me!