వివాదంలో సినీ నటుడు సాయిధరమ్ తేజ్.. శ్రీకాళహస్తిలో ఆలయంలో స్వామివారికి హారతి...

Published : Jul 15, 2023, 08:18 AM IST
వివాదంలో సినీ నటుడు సాయిధరమ్ తేజ్.. శ్రీకాళహస్తిలో ఆలయంలో స్వామివారికి హారతి...

సారాంశం

తెలుగు సినీ హీరో సాయిధరమ్ తేజ్ శ్రీకాళహస్తిలో వివాదంలో చిక్కుకున్నాడు. స్వామి వారికి స్వయంగా హారతివ్వడంతో ఇప్పడతని మీద భక్తులు మండిపడుతున్నారు. 

శ్రీకాళహస్తి : సినీ నటుడు, మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామికి సాయి ధరమ్ తేజ్ హారతిచ్చారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్.. అర్చకులు లేకపోవడంతో స్వయంగా హారతి ఇచ్చాడు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో.. భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నియమనిబంధనల ప్రకారం అర్చకులు మాత్రమే స్వామివారికి హారతులివ్వాలని.. సినీ హీరో ఎలా ఇస్తాడంటూ.. ఆలయ అదికారులు, సాయిధరమ్ తేజ్ మీద భక్తులు ఫైర్ అవుతున్నారు. 

సదరా కోసం విద్యార్థినులకు కరెంట్ షాక్.. ముగ్గురికి అస్వస్థత.. కళ్లుతిరిగిపడిపోయిన అమ్మాయి...

కాగా సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా కొద్ది రోజుల్లో రిలీజ్ అవ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే సాయిథరమ్ తేజ్ శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనను సాధరంగా ఆహ్వానించిన ఆలయ అధికారులు, దర్శనం చేయించారు. ఈ క్రమంలో హారతి వీడియో వెలుగు చూసింది. దీంతో సాయిధరమ్ తేజ్ ను హారతివ్వడానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నలు సంధిస్తున్నారు భక్తులు.

అయితే, అర్చకులు లేకపోవడంతోనే సాయిధరమ్ తేజ్ అలా చేశాడని.. నిబంధనలు ఉల్లంఘించడానికి కాదని ఆయన అభిమానులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భక్తుల ఆగ్రహం చల్లారడం లేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్