పవన్ పోటీ చేసేది ఇక్కడి నుంచే.. క్లారిటీ ఇచ్చిన కీలకనేత

By sivanagaprasad KodatiFirst Published Nov 20, 2018, 10:57 AM IST
Highlights

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చింది. కాకినాడ సిటీ, రూరల్ లేదా పిఠాపురంలలో ఏదో ఒక చోట నుంచి పవన్ పోటీ చేసే అవకాశం ఉందని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ముత్తా గోపాలకృష్ణ అన్నారు.

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చింది. కాకినాడ సిటీ, రూరల్ లేదా పిఠాపురంలలో ఏదో ఒక చోట నుంచి పవన్ పోటీ చేసే అవకాశం ఉందని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ముత్తా గోపాలకృష్ణ అన్నారు.

కాకినాడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోన్న పవన్ జిల్లాలో పోటీ చేయడం తూర్పుగోదావరికి గర్వకారణమన్నారు. తూర్పు సెంటిమెంట్‌తో కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఏదైనా స్థానం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా కార్యకర్తలు, జనసైనికులు, అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ ఆశయాలను క్షేత్రస్ధాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించామన్నారు. అంతకు ముందు అనంతపురం, ఏలూరులలో పోటీ చేస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 
 

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ మధ్య సీక్రెట్ భేటీ

అందుకు సిద్ధపడ్తా, సినిమాల్లో వంద కోట్లు సంపాదిస్తే...: పవన్ కల్యాణ్

కాంగ్రెస్ తో చంద్రబాబు: జగన్ కు నష్టం, పవన్ కల్యాణ్ కు జోష్

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

పవన్ కల్యాణ్ ప్లాన్ ఇదీ: మాయావతితో జరగని భేటీ

పవన్ కల్యాణ్ కు కేటీఆర్ ఫోన్: చంద్రబాబుపై కోపంతోనే...

Last Updated Nov 20, 2018, 11:01 AM IST