పరమేశ్వరుడి సేవలోనే ప్రాణాలొదిలిన అర్చకుడు

sivanagaprasad kodati |  
Published : Nov 20, 2018, 08:15 AM IST
పరమేశ్వరుడి సేవలోనే ప్రాణాలొదిలిన అర్చకుడు

సారాంశం

పరమేశ్వరుడికి పూజ చేస్తూ.. ఆయన సన్నిధిలోనే ప్రాణాలొదిలారు ఓ అర్చకుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రముఖ పంచారామ క్షేత్రం క్షీరా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉప ప్రధానార్చకుడిగా విధులు నిర్వర్తిస్తున్న కోట నాగ వెంకట వరప్రసాద్ కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. 

పరమేశ్వరుడికి పూజ చేస్తూ.. ఆయన సన్నిధిలోనే ప్రాణాలొదిలారు ఓ అర్చకుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రముఖ పంచారామ క్షేత్రం క్షీరా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉప ప్రధానార్చకుడిగా విధులు నిర్వర్తిస్తున్న కోట నాగ వెంకట వరప్రసాద్ కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో స్వామి వారికి అర్చన చేస్తుండగా వరప్రసాద్‌కు గుండెపోటు రావడంతో.. గర్భగుడిలోనే ప్రాణాలొదిలారు. ఆలయంలోనే పూజారి చనిపోవడంతో దర్శనాలు, పూజా కార్యక్రమాలను నిలిపివేశారు. ఆయన మరణంతో ఆలయ పరిసరాల్లో విషాద వాతావరణం చోటు చేసుకుంది.
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Pressmeet: 2026లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని అప్పుడే చెప్పా | Asianet News Telugu
YS Jagan Comments: నాకు మంచి పేరు వస్తుందని ప్రాజెక్టులన్నీ ఆపేశారు | Asianet News Telugu