అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి అత్యాచారం... వివాహితపై కామాంధుడి లైంగికదాడి...

Published : Oct 28, 2021, 01:30 PM IST
అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి అత్యాచారం... వివాహితపై కామాంధుడి లైంగికదాడి...

సారాంశం

కుటుంబ సభ్యులకు బారం కాకూడదనే ఉద్దేశ్యంతో తన కుటుంబానికి సన్నిహితుడైన కపిలేశ్వరపురం మండలం వడ్లమూరుకు చెందిన అంగర వీర్రాఘువులను Rental house చూస్తే వేరేగా ఉంటానని చెప్పింది. 

ఆలమూరు : వివాహిత ఒంటరితనాన్ని, నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఒక కామాంధుడు అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి లైంగిక దాడి జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో బాధితురాలు చాకచక్యంగా ఉపయోగించిన దిశ యాప్ నిందితుడిని పట్టించింది. 

ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల మధ్య జరిగిన ఈ ఘటన వివరాలను రామచంద్రపురం డీఎస్పీ డి. బాలచంద్రారెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ లో బుధవారం వెల్లడించారు. మండపేటకు చెందిన Married women తన భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా కొన్ని నెలలుగా అదే పట్టణంలో అమ్మగారి ఇంటివద్ద ఉంటోంది. 

కుటుంబ సభ్యులకు బారం కాకూడదనే ఉద్దేశ్యంతో తన కుటుంబానికి సన్నిహితుడైన కపిలేశ్వరపురం మండలం వడ్లమూరుకు చెందిన అంగర వీర్రాఘువులను Rental house చూస్తే వేరేగా ఉంటానని చెప్పింది. 

ఈ నెల 22రాత్రి బాధితురాలికి అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి రాఘవులు తన బైక్ పై జొన్నాడ తీసుకువచ్చి బాగా పొద్దు పోయేవరకూ పలు ప్రదేశాలకు తిప్పాడు. మాయ మాటలతో మభ్యపెట్టి జొన్నాడలోన తన friend ఇంటి వద్ద ఈ రాత్రి ఉండి ఉదయం వెళదామని నమ్మబలికాడు. 

అక్కడ నుంచి ఆమెను వెదురుమూడికి చెందిన దుర్గాప్రసాద్ సహకారంతో వడ్లమూరులో తన నివాసానికి తీసుకుపోయి Sexual assault జరిపారు. 

దిశ యాప్ ను ఆశ్రయించిన బాధితురాలు...
లైంగిక దాడితో తీవ్ర అస్వస్థతకు గురైన victim తన మొబైల్ నుంచి దిశ యాప్ ద్వారా కాల్ చేయడంతో పోలీసులకు సమాచారం అందింది. విషయం గ్రహించిన  నిందితుడు రాఘవులు ఆమె సెల్ ఫోన్ ను లాక్కుని స్విచాఫ్ చేయడంతో సిగ్నల్ కట్ అయ్యింది. 

పెద్దల్ని కాదని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.. ఇంటికి వచ్చి ఫ్యాన్ కు ఉరేసుకుని నవదంపతుల దారుణం...

అప్పటికే disha app ద్వారా సమాచారం అందుకున్న మండపేట రూరల్ సీఐ పెద్దిరెడ్డి శివగణేష్, ఆలమూరు ఎస్సై ఎస్. శివప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. మండపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్న సమాచరాంతో అక్కడకు వెళ్లి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. 

బుధవారం తెల్లవారుజామున నిందితులిద్దరినీ వారి నివాసాల వద్దే అదుపులోకి తీసుకుని ఆలమూరు పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ కేసును ఛేదించిన సీఐ శివగణేష్, ఎస్సై శివప్రసాద్ ను డీఎస్పీ బాలచంద్రారెడ్డి అభినందించారు. ప్రతి మహిళ దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని రక్షణ పొందాలని ఆయన సూచించారు. 

మేనమామ దారుణం...

ఇదిలా ఉండగా.. అనంతపురంలో అమానుషం చోటు చేసుకుంది. 14 యేళ్ల మైనర్ పై మేనమామ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికను మాయ మాటలతో లొంగదీసుకుని ఆమె మీద తరచుగా అత్యాచారం చేయడమే కాకుండా.. గర్భిణీని చేసిన 28 ఏళ్ల మామ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. 

కళ్యాణదుర్గం పట్టణంలోని చర్చ్ కాలనీకి చెందిన 28 ఏళ్ల మేనమామ 14 ఏళ్ల వయసున్న మేనకోడలిని లొంగదీసుకున్నాడు. ఆ తరువాత ఎవ్వరికీ అనుమానం రాకుండా తరచుగా ఆమె మీద rape చేసేవాడు.

ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. బాలిక వ్యవహారం అనుమానాస్పదంగా అనిపించడం, తరచుగా అనారోగ్యానికి గురవుతుండడంతో తల్లికి అనుమానం వచ్చింది. ఆస్పత్రికి తీసుకువెడితే విషయం బయటపడింది. దీంతో తల్లి షాక్ కు గురయ్యింది. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?