ఆ ఆస్తులపై జగన్ రెడ్డి కన్ను... భారీ కుట్రకు ప్లాన్: టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ సంచలనం

By Arun Kumar PFirst Published Oct 28, 2021, 1:03 PM IST
Highlights

వైసిపి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేవి మూసేసి, ప్రజల భవిష్యత్ ని నాశనం చేసే వాటిని ప్రోత్సహిస్తోందని... ఇందులో భాగంగానే ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేతకు కుట్ర పన్నుతోందని టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు.

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ పాలన ‎ తీరు వింతగా ఉందని తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ అన్నారు. కుటుంబాల్లో చిచ్చు బెడుతున్న మద్యం దుకాణాలు, యువతను మత్తుకు బానిసల్ని చేస్తున్న గంజాయి స్ధావరాల్ని మూసేయమని రాష్ట్ర ప్రజలు కోరుతుంటే ముఖ్యమంత్రి జగన్ వాటి‎ గురించి పట్టించుకోవడం లేదన్నారు. కానీ పేదల కడుపునింపే అన్న క్యాంటీన్లు, పేద విద్యార్ధుల భవిష్యత్తులో వెలుగులు నింపే ఎయిడెడ్ పాఠశాలల్ని మాత్రం మూసివేయటం సిగ్గుచేటని ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు.

''ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేవి మూసేసి, ప్రజల భవిష్యత్ ని నాశనం చేసే వాటిని ప్రోత్సహించటం బాధాకరం. jagan reddy... మూసేయాల్సింది పాఠశాలలు కాదు,‎ మీకు చేతనైతే రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, గంజాయి స్ధావరాలు, పేకాట క్లబ్బులు మూసేయాలి'' అని సూచించారు.

''విద్యారంగంలో ఘన చరిత్ర కలిగిన ఎయిడెడ్‌ విద్యా సంస్థలను మూసేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్నో ఏళ్ల క్రితమే సమాజంలో విద్యకున్న ప్రాముఖ్యతను గ్రహించిన ఎంతోమంది దర్మకర్తలు, దాతలు ‎సొంత స్ఠలాలు, ఆస్తులు ఇచ్చి ఎయిడెడ్ పాఠశాలల స్ధాపనకు కృషి చేశారు. కానీ నేడు ఆధునిక యగంలో ఉన్నా... cm ys jaganmohan reddy మాత్రం విధ్యార్ధుల భవిష్యత్ ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటూ విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు'' అని విమర్శించారు.

read more  ఇష్టం వుంటేనే తీసుకుంటాం.. బలవంతం లేదు: ఎయిడెడ్ స్కూల్స్ అప్పగింతపై మంత్రి ఆదిమూలపు క్లారిటీ

''Aided విద్యాసంస్థలను ఎలా పునరుజ్జీవింపజేయొచ్చో పరిశీలించకుండానే వాటిని మూసేయాలని ఏకపక్షంగా నిర్ణయించడం దారుణం. అవి మూతబడితే లక్షలాది మంది పేద విద్యార్థులకు చదువు దూరమవుతుంది... అంతేకాదు వేల కోట్ల రూపాయల విలువైన భూములు కైంకర్యం అవుతాయి'' అని ఆందోళన వ్యక్తం చేసాడు. 

''సంపద సృష్టించటం చేతకాక ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముతున్న జగన్ రెడ్డి కన్ను ఇప్పుడు ఎయిడెడ్ విద్యాసంస్ధల ఆస్తులపై పడింది. ‎  ఎయిడెడ్ పాఠశాలలు మూసి వేసి వాటి ఆస్తుల్ని అమ్మి లేదా  తాకట్టు పెట్టి అప్పులు తేవాలని జగన్ రెడ్డి చూస్తున్నారు. అందుకే ఎయిడెడ్ పాఠశాలల్ని మూసేందుకు కుట్ర పన్నారు'' అని ఆరోపించారు. 

''మాకు అమ్మఒడి వద్దు... మా స్కూలు మాకు కావాలని విద్యార్ధులు నినదిస్తున్నారు. స్వప్రయోజనాల కోసం విద్యార్ధుల జీవితాల్ని బలిచేయకుండా ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఎయిడెడ్‌ విద్యాసంస్థలు ఇతర రాష్ట్రాల్లో ఎలా నడుస్తున్నాయో ప్రభుత్వం పరిశీలించాలి'' అని సూచించారు. 

''ఎయిడెడ్‌ విద్యా సంస్థల భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలని నూతన జాతీయ విద్యావిధానం స్పష్టంగా చెప్పింది... ఇప్పటికే కేరళ ప్రభుత్వం ఆ విధంగానే చేస్తోంది. ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని మన రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యాసంస్థలు నిలదొక్కుకోవడానికి అన్ని చర్యలూ తీసుకోవాలి. లేకుంటే విద్యార్ధుల తరపున పోరాటం చేస్తాం'' ఎంవి ప్రణవ్ గోపాల్ స్పష్టం చేసారు.  

ఇలా ఎయిడెడ్‌ విద్యాసంస్థల అప్పగింతపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. ఈ విషయమై ఓ కమిటీ వేశామని చెప్పారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను అప్పగించాలని ప్రభుత్వం బలవంతం పెట్టలేదని సురేశ్ స్పష్టం చేశారు. విద్యాసంస్థల అంగీకారంతోనే ప్రభుత్వం వాటిని తీసుకుందని తెలిపారు. కమిటీ  ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని సురేశ్ వెల్లడించారు. విద్యాసంస్థల అభివృద్ధి కోసమే ప్రభుత్వం నిర్ణయాలు  తీసుకుందని .. ఒకవేళ ప్రైవేట్‌ విద్యాసంస్థలు తామే నడుపుకుంటామంటే స్కూళ్లను వెనక్కి తీసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.


 


 

click me!