ఏపీ: మంత్రి కొడాలి నాని హామీ.. ఆందోళన విరమించిన రేషన్ డీలర్లు, నవంబర్ కోటా యథాతథం

Siva Kodati |  
Published : Oct 28, 2021, 12:45 PM IST
ఏపీ: మంత్రి కొడాలి నాని హామీ.. ఆందోళన విరమించిన రేషన్ డీలర్లు, నవంబర్ కోటా యథాతథం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్ల ఆందోళనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కొడాలి నాని హామీ ఇవ్వడంతో రేషన్ డీలర్లు వెనక్కి తగ్గారు. నవంబర్ కోటా రేషన్‌ను ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని ఈ సందర్భంగా డీలర్లు ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్ల ఆందోళనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కొడాలి నాని హామీ ఇవ్వడంతో రేషన్ డీలర్లు వెనక్కి తగ్గారు. నవంబర్ కోటా రేషన్‌ను ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని ఈ సందర్భంగా డీలర్లు ప్రకటించారు. 

కాగా... ఏపీలో మంగళవారం నుంచి రేషన్ షాపులు (pds ration shops) బంద్ (bandh) అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుకు నిరసనగా రేషన్ షాపులు బంద్ చేపట్టారు డీలర్లు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చింది రేషన్ డీలర్ల అసోసియేషన్ (ration dealers association) . 2020 పీఎంజీకేవై (pmgky) కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్కిలస్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని రేషన్ డీలర్లు కోరుతున్నారు. వీరి నుంచి ఐసీడీఎస్‌కు మళ్లించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, గోనె సంచులను తిరిగి ప్రభుత్వానికిస్తే రూ.20 చెల్లించాలనే జీవోను అమలు చేయాల్సిందేనని డీలర్లు పట్టుపడుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో (telangana) అది పక్కాగా అమలవుతోందని గుర్తుచేశారు. 

ALso Read:డీలర్ల బంద్‌తో రేషన్ పంపిణీ నిలిచిపోదు: ఏపీ మంత్రి కొడాలి నాని

తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేదాకా నిరసనలు కొనసాగిస్తామన్న రేషన్ డీలర్లు.. ప్రస్తుతానికి బంద్ వాయిదా వేసినప్పటికీ, దుకాణాల్లో సరుకుల దిగుమతి, పంపిణీనిని నిలిపేస్తున్నామని, అయినాకూడా ప్రభుత్వం దిగిరాకపోతే సంపూర్ణ బంద్‌ కు దిగుతామని స్పష్టం చేశారు. తొలుత దుకాణాలు అన్నింటినీ బంద్ చేస్తామన్న రేషన్ డీలర్ల సంఘం.. ఆ తర్వాత సవరించుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించింది. దీంతో రేషన్ డీలర్లను బుజ్జగించేందుకు మంత్రి కొడాలి నాని, పౌరసరఫరాల శాఖ అధికారులు మంగళవారం నాడు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో బుధవారం నుంచి యధావిధిగా నిరసనలను కొనసాగించనున్నట్టుగా రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. తాజాగా గురువారం కొడాలి నాని మరోసారి రేషన్ డీలర్లతో నిర్వహించిన చర్చలు ఫలప్రదమయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి