
కనిగిరి : ఆమెకు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఐదు నెలల బాబు ఉన్నాడు. ఓ కామాంధుడు తన కోరిక తీర్చాలంటే నెలరోజులుగా వెంటపడుతున్నాడు. తనకు అధికారం ఉందని... ఎవరూ ఏమీ చేయలేరు.. అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో భయపడిన ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
ఈ విషయం తెలిసిన కామాంధుడు ‘నా పైనే ఫిర్యాదు చేస్తావా’ అంటూ ఆమెతో పాటు ఆమె తల్లిపై కూడా విచక్షణారహితంగా attack చేశాడు. అయినా policeల నుంచి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…
కనిగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన married womanను అదే ప్రాంతంలోని తాళ్లూరుకు చెందిన సిహెచ్ ఏడుకొండలు కొంతకాలంగా sexual harassment చేస్తున్నాడు. ఆమె భర్తకు ఫోన్ చేసి ఆమెను తన వద్దకు పంపాలంటూ బెదిరించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక గత నెల 28వ తేదీన ఆమె కనిగిరి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది.
అయినా చర్యలు లేకపోవడంతో.. ఈ నెల 17న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమంలో మరోసారి వినతి అందించింది. అయినా చర్యలు లేకపోవడంతో ఈ నెల 17న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మరోసారి వినతి అందించింది. అక్కడినుంచి కనిగిరి చేరుకుని తల్లితో కలిసి ఆమె నడిచి వస్తుండగా స్థానిక పామూరు బస్టాండ్ సమీపంలో ఏడుకొండలు అడ్డుకున్నాడు.
‘నా పైన కేసు పెడతారా’ అంటూ రక్తం వచ్చేలా వారిద్దరినీ కొట్టాడు. ‘కుటుంబాన్ని ఊళ్ళో లేకుండా చేస్తా.. నీ భర్తను తరిమేస్తా’ అని తీవ్రంగా హెచ్చరించాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఆమె మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దాడి కేసు నమోదు చేసుకున్నారు. ఆయన ఏడుకొండలుపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో గురువారం కుటుంబసభ్యులంతా కనిగిరిలోని రజక సంఘం నాయకులను కలిసి తమ గోడు వినిపించారు.
ఈ విషయమై ఎస్ ఐ జి రామిరెడ్డిని వివరణ కోరగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రస్తుతం విచారిస్తున్నట్లు తెలిపారు. వేధింపులకు పాల్పడుతున్న ఏడుకొండలును వెంటనే అరెస్టు చేయకపోతే రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేస్తామని నాయకులు కోమటిగుండ్ల చెన్నయ్య, వెంకటేశ్వర్లు తెలిపారు.
నల్గొండలో విషాదం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, ఆత్మహత్య చేసుకొన్న తండ్రి
ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో డిసెంబర్ 10న ఇలాంటి వేధింపుల సంఘటనే వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ లో తండ్రి Pension తనకు మంజూరు చేయాలని కోరుతూ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లిన ఓ యువతిని తనకున్న అధికారంతో లోబరుచుకోవాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. సదరు యువతి పట్ల Rudeగా ప్రవర్తించాడు. ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించాడు ఆ అధికారి. నాలుగు రోజుల క్రితం Medical Treasury Officeలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి…
నగర శివారు ప్రాంతానికి చెందిన ఓ యువతి తండ్రి Government teacherగా పని చేసి రిటైర్డ్ అయ్యి పింఛనును తీసుకుంటున్నారు. అయితే ఇటీవల అతను మరణించడం... అంతకుముందే తల్లి కూడా చనిపోవడంతో యువతి అనాథగా మారింది. దీంతో తండ్రికి వచ్చే పింఛన్ తనకు మంజూరు చేయాలని కోరుతూ నాలుగు నాలుగు రోజుల క్రితం మేడ్చల్ ట్రెజరీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది.
అయితే, తనతో Cinemaకు వస్తేనే పింఛను మంజూరు చేస్తానంటూ అక్కడ అదనపు ట్రెజరీ అధికారి(ఏటీవో) గా పనిచేస్తున్న పవన్ కుమార్ ఆ యువతిని
Sexually harassed చేశాడు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో సదరు అధికారి అక్కడినుంచి మెల్లగా జారుకున్నాడు. విషయాన్ని అక్కడి అధికారులకు, టిఆర్ఎస్ నాయకులకు చెప్పగా ఏటీవోకు యువతికీ మధ్య రాజీకి ప్రయత్నించారు తప్ప అసలు విషయాన్ని బయటకు రానివ్వలేదు.
అయితే, ఇది అంతా అబద్ధం అని... యువతికి వివాహం కాలేదు అని చెబుతూ పింఛన్ పొందాలని చూసిందని.. కానీ నిబంధనల ప్రకారం ఆమె దరఖాస్తును తిరస్కరించి రికవరీకి ఆదేశాలు ఇవ్వడంతోనే ఆ యువతి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఏటీవో పవన్ కుమార్ వివరణ ఇచ్చారు.