మూడేళ్ల వయసులో తప్పిపోయి.. 14 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

Published : Dec 24, 2021, 06:16 AM IST
మూడేళ్ల వయసులో తప్పిపోయి.. 14 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

సారాంశం

మూడేళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు 14 ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో చోటుచేసుకుంది. మూడేళ్ల వయసులో ఇంటి ముందు ఆడుకుంటూ బాలుడు తప్పిపోయాడు. అప్పుడే పోలీసులకు ఫిర్యాదు అందింది. తాజాగా, మరో ఊరిలో 14 ఏళ్ల నుంచి ఓ బాలుడిని పెంచుకుంటున్నారని తెలియడంతో పోలీసులు ఆరా తీశారు.

అమరావతి: తొమ్మిది నెలలు మోసి.. జన్మనిచ్చిన తల్లి.. తన కొడుకు(Son) కనిపించకుండా పోయేసరికి(Missing) విలవిల్లాడిపోయింది. కళ్ల ముందే మాయమైపోవడాన్ని ఏళ్ల తరబడి తలుచుకుంటూ బాధపడుతూనే ఉన్నది. తన కొడుకు మూడేళ్ల వయసులో ఇంటి ముందు ఆడుకుంటూనే అదృశ్యం అయ్యాడు. అప్పుడు చుట్టు పక్కల ఎంతో గాలింపులు జరిపారు. కానీ, పిల్లాడి ఆచూకీ లభించలేదు. చేసేదేమీ లేక.. పోలీసులను ఆశ్రయించారు. తమ కుమారుడిని వెతికి పెట్టాల్సిందిగా ఫిర్యాదు చేసి వచ్చారు. సంవత్సరాల కొద్ది రోజులు గడిచి పోతూనే ఉన్నాయి. కానీ, కుమారుడు తమకు కనిపించలేదు. పోలీసులకూ చిక్కలేదు. ఏళ్లు గడిచిపోతున్నా.. కొడుకు మళ్లీ తన దగ్గరకు తిరిగి వస్తాడన్న ఆశ మాత్రం ఆ తల్లిదండ్రుల్లో చావలేదు. వారి ఆశే నిజమైంది.

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టవారిపల్లెకు చెందిన శంకర్, రెడ్డెమ్మ దంపతులు, వారిద్దరికి ఆకాశ్ అనే కొడుకు ఉన్నాడు. ఆకాశ్ మూడేళ్ల వయసులో ఇంటి బయట ఆడుకుంటూ.. కనిపించకుండా పోయాడు. చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించాడు. పిల్లాడి ఆచూకి దొరకలేదు. దీంతో చేసేదేమీ లేక పోలీసులనూ ఆశ్రయించారు. టూటౌన్ పోలీసు స్టేషన్‌లో తమ కొడుకు కనిపించకుండా పోయాడని ఫిర్యాదు చేశారు. పోలీసులూ అప్పటి నుంచి బాలుడి కోసం గాలింపులు జరుపుతూనే ఉన్నారు.

Also Read: పన్నెండేళ్ల క్రితం చనిపోయిన భర్త.. మళ్లీ పెళ్లి చేసుకున్న భార్య.. హఠాత్తుగా తిరిగిరావడంతో...

మదనపల్లె మండలం రామాపురానికి చెందిన దంపతులు వెంకటరమణ, లలితలు సుమారు 14 ఏళ్ల నుంచి ఓ బాలుడిని పెంచుకుంటున్నట్టు సీఐ నరసింహులుకు సమాచారం వచ్చింది. 14 ఏళ్ల క్రితం నాటి శంకర్, రెడ్డెమ్మ దంపతుల ఫిర్యాదునూ ఈ ఘటనతో పోల్చుకున్నాడు. బహుశా వీరి కుమారుడు ఆకాశ్ అయి ఉంటాడని అంచనా వేశాడు. దీంతో ఎస్ఐ నరసింహులు.. వెంకటరమణ, లలితలను బాలుడి గురించి విచారించారు. 2008లో నీరుగట్టువారి పల్లెలో తమకు ఈ బాలుడు లభించినట్టు పోలీసుల ముందు అంగీకరించారు. దీంతో ఆకాష్ అసలు తల్లిదండ్రులు శంకర్, రెడ్డెమ్మలకు సమాచారం ఇచ్చారు. వార్త వినగానే ఆ దంపతులు వేగంగా పోలీసు స్టేషన్ చేరుకున్నారు. 14 ఏళ్ల కళ రూపం పోసుకుని ఎదురైనట్టుగా ఆ  తల్లిదండ్రలు ఆప్యాయంగా బాలుడిని దగ్గరకు తీసుకున్నారు. గుండలకు హత్తుకున్నారు(Reunited).ఇద్దరూ బాలుడిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పిల్లాడిని చూసుకుంటూ ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఇంటికి వెళ్లారు. తమ కొడుకును కనిపెట్టి తమకు అప్పగించినందుకు ఆ దంపతులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: మంగళగిరిలో కలకలం... స్కూల్ నుండి నలుగురు చిన్నారులు మిస్సింగ్ (Video)

ఇదే నెలలో మంగళగిరి పట్టణంలో నలుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు.మంగళగిరిలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో నివాసముండే చిన్నారులు మానుకొండ సంతోష్, ఈడె వెంకటేష్ గౌడ్, కలవకొండ వెంకటేశ్, కలవకొండ ప్రభుదేవా మంచి స్నేహితులు. వీరిలో ముగ్గురు విద్యార్థులు స్థానికంగా టిప్పర్ల బజార్ లోని మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇద్దరు ఐదో తరగతి, ఒకరు నాలుగో తరగతి చదువుతున్నాడు.ఇక మరో విద్యార్థి వెంకటేశ్ గౌడ్ యర్రబాలెం (yarrabalem) లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. వీరి నివాసాలు ఒకే కాలనీలో వుండటంతో అందరూ కలిసే పాఠశాలకు వెళ్లేవారు. ఇలా సోమవారం కూడా స్కూల్ కు కలిసే వెళ్లారు. ఇలా స్కూలుకని వెళ్లిన విద్యార్థులు మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!