టికెట్ల ధరల ఎఫెక్ట్.. 55 థియేటర్లు మూత, తాళాలు వేసుకున్న యజమానులు

By SumaBala Bukka  |  First Published Dec 24, 2021, 7:12 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాజమహేంద్రవరం గ్రామీణంలోని నామవరం, ధవళేశ్వరం.. కాకినాడ గ్రామీణంలోని వాకలపూడి, జగ్గంపేట, రావులపాలెం, గోకవరం, అమలాపురం, రాయవరం, మలికిపురం, సీతానగరం, రాజోలు, కోరుకొండ, ఉప్పాడ, ముమ్మిడివరం, గొల్లప్రోలు తదితర చోట్ల సినిమా హాళ్లను యజమానులు మూసేస్తున్నారు. 


అమరావతి :  రాష్ట్ర ప్రభుత్వం Ticket priceలను తగ్గించడంతో సినిమా Theaters నడవడం తమ వల్ల కాదని యజమానులు వాటిని స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీల పరిధిలోని థియేటర్ల విషయంలో ఈ పరిస్థితి నెలకొంది. corona virus నుంచి బయటపడే  తరుణంలో సర్కారు టికెట్ల ధరలు తగ్గించడంతో ఆర్థిక భారాన్ని మోయలేక..  తూర్పుగోదావరి జిల్లాలో 45 మంది యజమానులు గురువారం థియేటర్లను Voluntarily మూసివేశారు.

అనంతపురం జిల్లా పెనుకొండ,  కృష్ణాజిల్లా నందిగామ,  మైలవరం, పెనుగంచిప్రోలు,  శ్రీకాకుళం జిల్లా కొత్తూరులలో తమ థియేటర్లకు యజమానులే స్వయంగా తాళాలు వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాజమహేంద్రవరం గ్రామీణంలోని నామవరం, ధవళేశ్వరం.. కాకినాడ గ్రామీణంలోని వాకలపూడి, జగ్గంపేట, రావులపాలెం, గోకవరం, అమలాపురం, రాయవరం, మలికిపురం, సీతానగరం, రాజోలు, కోరుకొండ, ఉప్పాడ, ముమ్మిడివరం, గొల్లప్రోలు తదితర చోట్ల సినిమా హాళ్లను యజమానులు మూసేస్తున్నారు. 

Latest Videos

undefined

పండుగల వేళ ధరల తగ్గింపు  పిడుగు
సినీ పరిశ్రమకు పండుగలు చాలా కీలకం. కరోనా కారణంగా గత ఏడాది మార్చి/ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఆగస్టు/ సెప్టెంబర్ వరకు మూతపడిన థియేటర్లకు ఇటీవల అఖండ, పుష్ప చిత్రాలు ఊపిరిలూదాయి.  అయితే ప్రభుత్వ తాజా జీవో 35 ప్రకారం… గ్రామీణ ప్రాంతాల్లోని ఏసీ థియేటర్లలో టికెట్ల ధరలు రూ.10, రూ.15, రూ.20.. నాన్ ఏసీ థియేటర్లలో రూ.5, రూ.10, రూ.15..మున్సిపాటీల్లో రూ.30, రూ.50, రూ. 70, కార్పొరేషన్ పరిధిలోని థియేటర్ లలో రూ. 40, రూ, 60, రూ. 100లకు విక్రయించాలి. 

టికెట్ల వ్యవహారం.. నానికి ఏపీ మంత్రుల కౌంటర్, బయటకొస్తున్న సినీ ప్రముఖులు

 ఒక్కో థియేటర్ సామర్థ్యాన్ని అనుసరించి నిర్వహణ ఖర్చుల కింద నెలకు కనీసం మూడు లక్షల నుంచి 5 లక్షల వరకు అవుతుంది.  థియేటర్ను నమ్ముకొని ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 మంది వరకు ఉపాధి పొందుతున్నారు.  ఈ పరిస్థితుల్లో తగ్గించిన ధరలతో వచ్చే ఆదాయం నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోదని యజమానులు పేర్కొంటున్నారు.  కరోనా కారణంగా ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల విద్యుత్ బిల్లుల మాఫీ హామీ సైతం అమలుకు నోచుకోలేదని గుర్తుచేస్తున్నారు.

 ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట లోని నాగేశ్వర థియేటర్ యజమాని తులా నరసింహారావు మాట్లాడుతూ ‘రెండేళ్లుగా సినిమాహాలు నడవడం లేదు. ప్రభుత్వం తాజా నిబంధనల ప్రకారం ..సినిమా హాల్  నడవాలంటే కరెంట్ ఖర్చులు కూడా రావు. ఓటీటీ, ఇతర మాధ్యమాల ప్రభావం మా హాళ్లపై పడింది. టికెట్ ధర తగ్గింపు కారణంగా థియేటర్లను స్వచ్ఛందంగా  మూసి వేయక తప్పడంలేదు.  గతంలో పల్లెలకు పట్టణాలకు పన్నులలో తేడా ఉండేది.  ఇప్పుడు అన్ని చోట్లా ఒకే పన్ను విధిస్తున్నారు’ అని వాపోయారు.

చిత్తూరు జిల్లాలో 11 థియేటర్లో సీజర్…
చిత్తూరు జిల్లా కుప్పం లో నాలుగు, మదనపల్లిలో ఏడు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. బి.ఫారం రెన్యువల్ చేసి, అనుమతి పొందిన తర్వాత మాత్రమే తెరవాలని యజమానులకు సూచించారు.వీరులను తనిఖీలు జరిగాయి వసతుల లోపాలపై ప్రకాశం జిల్లాలో 28 థియేటర్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, సత్తెనపల్లిలో, మంగళగిరిలోని థియేటర్లను అధికారుల బృందాలు పరిశీలించాయి.

గమనించిన లోపాలకు తగ్గట్లు నోటీసులు జారీ చేస్తున్నారు.  అనంతపురం జిల్లా గోరంట్లలో అనుమతులు రెన్యువల్ చేసుకోలేదని పలు థియేటర్లను మూసివేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఓ థియేటర్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ సోదాలు చేశారు.  పలుచోట్ల అగ్నిమాపక సిబ్బంది కూడా తనిఖీలకు ఉపక్రమించారు. నెల్లూరు జిల్లా  గూడూరు లో నాలుగు, కోటలో రెండు, సూళ్లూరు పేటలో మూడు థియేటర్లలో తనికీలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో గురువారం తనిఖీల పర్వం కొనసాగింది. కృష్ణ జిల్లాలో బు బుధవారం అధికారులు సీజ్ చేసిన 12 థియేటర్ల పరిస్థితి గురువారం కూడా అలాగే ఉంది. 
 

click me!