కరోనా సోకిందని భ్రమ పడి.. వ్యక్తి ఆత్మహత్య

By telugu teamFirst Published Feb 11, 2020, 11:54 AM IST
Highlights

తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగకు చెందిన బాలకృష్ణ(50) గుండె దడగా ఉందని పరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకి వెళ్లాడు. పరీక్షల అనంతరం ఏదో వైరస్ సోకిందని డాక్టర్లు చెప్పారు. రెండు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాడు. 

ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్. చైనాలోని వుహాన్ లో ఈ వైరస్ తొలుత మొదలైంది. కాగా తర్వాత చాలా దేశాలు పాకింది. ఈ వైరస్ కారణంగా 900ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే... ఈ వైరస్ సోకిందనే భ్రమలో ఓ వ్యక్తి ఆత్మహత్యచేసుకున్నాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read బావ మరిది భార్యపై కన్నేసి... వివస్త్రను చేసి.

పూర్తి వివరాల్లోకి వెళితే... తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగకు చెందిన బాలకృష్ణ(50) గుండె దడగా ఉందని పరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకి వెళ్లాడు. పరీక్షల అనంతరం ఏదో వైరస్ సోకిందని డాక్టర్లు చెప్పారు. రెండు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వచ్చి తనకు కరోనా వైరస్ సోకిందని, తనను ముట్టుకోవద్దని కుటుంబసభ్యులతో చెప్పాడు.

దగ్గరకు వచ్చిన కుటుంబ సభ్యులను రాళ్లతో కొట్టి తరిమి ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. కుటుంబసభ్యులు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన వారు పట్టించుకోలేదు. సోమవారం తెల్లవారుజామున బాలకృష్ణ ఇంట్లోంచి బయటకు వెళ్లి తన పొలానికి వెళ్లి అక్కడ తల్లి  సమాధి వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. 

click me!