జగన్ సర్కార్ మరో షాక్: జేసీ దివాకర్ రెడ్డి భద్రత తొలగింపు

By telugu teamFirst Published Feb 11, 2020, 11:15 AM IST
Highlights

టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి భద్రతను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. జేసీకి భద్రత తొలగింపు రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. జేసీకి భద్రతను తొలగించడం పట్ల టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి భద్రతను ప్రభుత్వం తొలగించింది.గతంలో గన్‌‌మెన్‌లను 2+2 నుంచి 1 + 1 కు తగ్గించిన జగన్ ప్రభుత్వం తాజాగా పూర్తి భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు గత రాత్రి జేసీ దివాకర్‌రెడ్డికి భద్రత తొలిగిస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

జేసీకి భద్రత తొలగింపు రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. జేసీకి భద్రతను తొలగించడం పట్ల టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జేసీ కుటుంబంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం లక్ష్యంగానే దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: జేసీకి షాక్: దివాకర్ ట్రావెల్ కు రూ. 100 కోట్ల జరిమానా, క్రిమినల్ కేసులు

జేసీ బ్రదర్స్ కు చెందిన దివాకర్ ట్రావెల్స్ పై రూ.100 కోట్ల జరిమానా వేసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ జాయింట్ కమిషన్ ప్రసాద్ రావు ఇటీవల చెప్పారు. పోలీసు కేసులు కూడా నమోదు చేయనున్నట్లు చెప్పారు. దివాకర్ రెడ్డి కుటుంబానికి దివాకర్ రెడ్డి ట్రావెల్స్ ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్నారంటూ అనంతపురం జిల్లా అంతటా ఆరు బస్సులను ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు.

పోలీసులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో తీవ్రమైన ఇబ్బందులకు గురైన విషయం కూడా తెలిసిందే. గంటల కొద్దీ పోలీస్ స్టేషన్ లోనే ఆయనను కూర్చోబెట్టి చివరకు బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారు.

Also Read: సీజ్ చేసి రిలీజ్ చేశారు.. మళ్లీ సీజ్ చేశారు: ఆర్టీఏ అధికారులపై జేసీ సీరియస్

వైసీపీ అధికారంలోకి రాక ముందు నుంచే జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. 

click me!