
Kurnool : చదువుకున్న కాలేజీకి తనవంతు సాయం చేయాలని భావించిన మకుటా డెవలపర్స్ చైర్మన్ ఆండ్ వ్యవస్థాపకులు జనార్ధన్ కొంపల్లి కీలక ప్రకటన చేశారు. కర్నూల్ లోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కాలేజీలో జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలేజీలో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్ షిప్ అందించనున్నట్లు... ఇందుకోసం రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు జనార్ధన్.
చదువులో మంచి ప్రతిభ కనబరుస్తూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు కొంపల్లి జనార్థన్ తెలిపారు. కర్నూల్ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని... అద్భుతాలు సాధించాలనే ఈ స్కాలర్ షిప్స్ ను ప్రకటించినట్లు జనార్ధన్ తెలిపారు.
సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమావేశంలో ఎస్ సత్యనారాయణ (ఐఎఎస్), ప్రొఫెసర్ వెంకట బసవరావు కూడా పాల్గొన్నారు. వీరి సమక్షంలోనే మకుటా డెవలపర్స్ చైర్మన్ జనార్ధన్ ఆర్థికసాయం ప్రకటన చేశారు. విద్యార్థుల చదువుకోసం జనార్ధన్ కొంపల్లి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు.