Independence Day 2022 : వినూత్న రీతిలో దేశభక్తి చాటిన కర్నూల్ వాసి కల్యాణ్....

By Bukka SumabalaFirst Published Aug 15, 2022, 8:17 AM IST
Highlights

భారత స్వాతంత్య్ర దినోత్స వజ్రోత్సవాల వేళ ఓ వ్యక్తి అరుదైన రీతిలో తన దేశభక్తిని చాటుకున్నాడు. తల మీద 75 ఆకారం వచ్చేలా కట్ చేయించుకున్నాడు. 

కర్నూలు : ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీలు, జెండా వందనాలు చేశారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు ఆయా గ్రామాల్లో ర్యాలీలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జెండా కార్యక్రమాలు జరిగాయి. చేశారు ప్రజాప్రతినిధులు మొదలు సామాన్యుల వరకూ అందరూ తమ ఇళ్లపై జెండాలను ఎగురవేసి తన దేశభక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలోనే కర్నూలుకు చెందిన కళ్యాణ్ అనే వ్యక్తి వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నాడు. దేశ స్వాతంత్య్ర వజ్సోత్సవ వేడుకల వేల తన తల వెంట్రుకల్ని 75 వ స్వాతంత్ర వేడుకలకు చిహ్నంగా తీర్చి దిద్దుకున్నాడు.

75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కల్యాణ్ ప్రదర్శించిన దేశభక్తి..అందరికీ అబ్బురపరిచింది. ఇది వినూత్న ప్రచారానికి దారితీసింది. సాధారణంగా తలవెంట్రుకలను దేవుళ్లకు సమర్పించుకోవడాన్ని మనం చూస్తుంటాం. అయితే ఉమ్మడి కర్నూల్ జిల్లావాసి తనదైన శైలిలో దేశభక్తి ప్రదర్శించాడు.  దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కర్నూలుకు చెందిన కళ్యాణ్ అనే వ్యక్తి 75 ఆకారం వచ్చేలా కటింగ్ చేయించుకుని దేశ భక్తిని చాటుకున్నాడు.  

Independence Day 2022 : 75వ స్వాతంత్ర్య దినోత్సవ షెడ్యూల్ ఇదే...

దేశానికి స్వాతంత్రం వచ్చి యాభై ఏళ్ళు అయినపుడు కూడా.. 50 ఆకారం వచ్చేలా కటింగ్ చేయించుకుని అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వినూత్న రీతిలో దేశం పట్ల గౌరవాన్ని చాటుకుంటున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు తమ దైన శైలిలో దేశభక్తిని ప్రదర్శించాలని కోరుతున్నాడు. 

click me!