పార్టీ పెడతానని అనుకోలేదు... పదవే వెతుక్కుంటూ రావాలి, మనం వెంటపడకూడదు : పవన్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 14, 2022, 9:54 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి వెతుక్కుంటూ రావాలి గానీ పదవి వెంట పడకూడదని అన్నారు. పార్టీ పెడతానని తాను అనుకోలేదని.. రాబోయే తరాల్లో బాధ్యతలు గుర్తుచేసేందుకు, మేలుకొలిపేందుకే పార్టీ పెట్టానని పవన్ పేర్కొన్నారు.

జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలోకి ఐటీ పరిశ్రమను తీసుకొస్తామన్నారు. హైదరాబాద్, బెంగళూరులలో ఐటీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిందని... రాయలసీమ యువత బెంగళూరుకు వెళ్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

దావోస్ వెళ్లి ఫోటోలు దిగినంత మాత్రాన పెట్టుబడులు రావని సీఎం జగన్‌పై (ys jagan) పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. అద్భుతాలు జరుగుతాయని తాను పార్టీ పెట్టలేదని.. అనుభవం లేకుండా వస్తే వైసీపీ ప్రభుత్వం మాదిరిగా వుంటుందని ఆయన అన్నారు. పదవి వెతుక్కుంటూ రావాలి గానీ పదవి వెంట పడకూడదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పదవి అనేది ప్రయాణంలో భాగంగా కావాలని... స్థాయి, స్థోమత ఉంటే ప్రజలే అవకాశం ఇస్తారని ఆయన పేర్కొన్నారు. 

Also Read:Pawan kalyan: పవన్ కి బిగ్ షాక్... సినిమాలు వదిలేస్తాడా!

అప్పులు తెచ్చి అభివృద్ధి అంటే రాష్ట్రానికి ఆర్ధికపరిపుష్టి ఎలా సాధ్యమవుతుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను ప్రజలను బలహీనపరిచేలా ఉండకూడదని ఆయన అన్నారు. పార్టీ పెడతానని తాను అనుకోలేదని.. రాబోయే తరాల్లో బాధ్యతలు గుర్తుచేసేందుకు, మేలుకొలిపేందుకే పార్టీ పెట్టానని పవన్ అన్నారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆయన.. ఖలిస్తాన్, జిహాదీ ఉద్యమాలు చూస్తే భయమేస్తోందన్నారు. 

click me!