రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్: రేపటి కేఆర్ఎంబీ బృందం పర్యటన వాయిదా

By Siva KodatiFirst Published Aug 4, 2021, 8:20 PM IST
Highlights

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బృందం రేపటి ఏపీ పర్యటన వాయిదా పడింది. త్వరలో మరో తేదీని ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. ఎన్జీటీ ఆదేశాలతోనే కేఆర్ఎంబీ బృందం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ సందర్శనను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. 
 
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను గురువారం పరిశీలించాలని కేఆర్ఎంబీ అధికారులు భావించారు. ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించి  నివేదిక ఇవ్వాలని  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేఆర్ఎంబీని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ అధికారులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించాలనుకున్నారు. 

Also Read:రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలనకు కేఆర్ఎంబీ: ఏపీ షరతు ఇదీ....

గతంలోనే ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్లాలని కేఆర్ఎంబీ అధికారులు ఏపీకి సమాచారం పంపారు. అయితే కరోనా సమయంలో రావొద్దని ఏపీ తేల్చి చెప్పింది. అయితే ఈ బృందంలో తెలంగాణ ప్రతినిధులు ఎవరూ కూడా ఉండొద్దని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి స్పష్టం చెప్పింది. కాగా, ఆగస్టు 3న కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ ప్రతినిధులు హాజరవ్వగా.. తెలంగాణ ప్రతినిధులు మాత్రం డుమ్మా కొట్టారు.

click me!