ఏపీ ఈఎస్ఐ స్కాం: నలుగురి అరెస్ట్, వెలుగులోకి కీలక విషయాలు

By Siva KodatiFirst Published Aug 4, 2021, 7:14 PM IST
Highlights

ఏపీ ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఫార్మా అమ్మకాల పేరుతో కంచర్ల శ్రీహరి షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. నాలుగు సంస్థలను ఒకే అడ్రస్‌లతో వేరు వేరు కంపెనీలుగా నడిపినట్లు ఏసీబీ అధికారులు నిర్థారించారు

ఏపీ ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఫార్మా అమ్మకాల పేరుతో కంచర్ల శ్రీహరి షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. నాలుగు సంస్థలను ఒకే అడ్రస్‌లతో వేరు వేరు కంపెనీలుగా నడిపినట్లు ఏసీబీ అధికారులు నిర్థారించారు. కూకట్‌పల్లికి చెందిన  లెజెండ్ ఎంటర్‌ప్రైజెస్, మెడి ఓమ్ని ఎంటర్‌ప్రైజెస్, ఓమ్ని హెల్త్ కేర్ సహా అన్నింటిని ఒకే అడ్రస్‌పై శ్రీహరి నడుపుతున్నట్లు తేల్చారు. ఈ స్కామ్‌కు సంబంధించి నలుగురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్‌ను ఏ-18గా, ఏ-19గా కంచర్ల శ్రీహరి, ఓమ్నీ హెల్త్ కేర్ అధినేత కంచర్ల సుజాతను ఏ-20గా, ఓమ్నీ హెల్త్ కేర్ మేనేజర్ బండి వెంకటేశ్వర్లును ఏ-21గా నమోదు చేశారు.


 

click me!