ప్రస్తుతం గుంటూరులోని ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా... ఆరోగ్యం నిలకడగా ఉందని... కాగా... మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి ఆయనకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా హుటా హుటిన ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం గుంటూరులోని ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా... ఆరోగ్యం నిలకడగా ఉందని... కాగా... మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా... శుక్రవారం ఉదయం కోడెల నివాసంలో కంప్యూటర్లను కొందరు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో వైఎస్ఆర్ సీపీ నేతల హస్తం ఉందని కోడెల ఆరోపించారు. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన సత్తెనపల్లిలోనే ఉన్నారు.
శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆయన గుంటూరుకు చేరుకొన్నారు. పార్టీ నాయకులు, న్యాయవాదులతో ఫోన్లో మాట్లాడుతున్నసమయంలనే ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోడెల అల్లుడు డాక్టర్ మనోహర్ వైద్యపరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.
నలుగురు డాక్టర్ల వైద్య బృందం కోడెలకు చికిత్స అందించారు. గుంటూరులోని కోడెల తనయుడు కోడెల శివరామ్ షోరూమ్ లో అసెంబ్లీ ఫర్నీచర్ ను లెక్కలు తీసేందుకు శుక్రవారం నాడు అసెంబ్లీ, రవాణా అధికారులు షోరూమ్ లో తనఖిలు చేశారు.
అదే రోజులన స్కిల్ డెవలప్ మెంట్ కార్యాలయంలో 30 ల్యాప్ టాప్ లు పోయాయని కోడెల కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు అందింది.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సంబంధిత వార్తలు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు
కోడెల ఫర్నీచర్ దోచేస్తే, చంద్రబాబు ప్రజాధనాన్ని దాచేశారు : ఇద్దరూ దొంగలేనన్న ఏపీ మంత్రి
నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల
కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు
దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు
అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల
అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల
అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?
కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు