‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు

By sivanagaprasad kodatiFirst Published Sep 26, 2018, 9:21 AM IST
Highlights

విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు ముందు చోటు చేసుకున్న విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్న పోలీసులు మరిన్ని వాస్తవాలను బయటకు లాగుతున్నారు. 

విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు ముందు చోటు చేసుకున్న విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్న పోలీసులు మరిన్ని వాస్తవాలను బయటకు లాగుతున్నారు.

కిడారి వాహనాన్ని అడ్డగించిన తర్వాత.. ఆయన్ను కిందకు దించిన తర్వాత కొద్దిదూరం కాలినడకన తీసుకువెళ్లడం.. అరమ రోడ్డులో చెట్టు కింద మావోయిస్టులు చేసిన హెచ్చరికలు.. ఇతర విషయాలు బయటకు వస్తున్నాయి. ‘‘ మాట్లాడుకుందాం.. కాల్పులు జరపవద్దని’’ కిడారి వేడుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

మైనింగ్‌ను, రాజకీయాలను వదిలేస్తానని.. విడిచిపెట్టండి అన్నా అంటూ ఎమ్మెల్యే మావోయిస్టులను వేడుకున్నారని అంటున్నారు. కోట్లు తీసుకుని పార్టీ మారావు.. ఆ డబ్బు చాలలేదా..? అంటూ మావోయిస్టులు ప్రశ్నించారని... బాక్సైట్ కోసమే రోడ్లను నిర్మిస్తున్నారు... బాక్సైట్‌ను వెలికితీస్తే గిరిజనుల జీవితాలు నాశనమవుతాయని మావోయిస్టులు అన్నారని పేర్కొంటున్నారు.

నీకు ఇప్పటికే ఎన్నో అవకాశాలు ఇచ్చాం.. ఇక చాలు అంటూ మావోలు ఎమ్మెల్యేపై కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మరోవైపు కిడారి హత్యకు రెండు రోజుల ముందు.. ‘‘ మావోల నుంచి మీకు ముప్పు పొంచి ఉంది... సమాచారం లేకుండా గ్రామాల్లో పర్యటించడం మంచిది కాదు’’ అని ఓ పోలీసు అధికారి సర్వేశ్వరరావుకు సూచించారట. దీనిని తేలిగ్గా తీసుకున్న కిడారి.. నిత్యం ప్రజల్లో ఉండకపోతే ఎన్నికల సమయంలో ప్రయోజనం వుండదు అని చెప్పి.. వరుస పర్యటనలు ప్లాన్ చేసుకున్నారు.

అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?

అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

click me!