జగన్ 30 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సీఎం కాలేడు: మంత్రి ప్రత్తిపాటి

By Nagaraju TFirst Published Sep 25, 2018, 8:08 PM IST
Highlights

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు వేల కిలోమీటర్లు కాదు, 30వేల కిలోమీటర్లు నడిచిన సీఎం కాలేరని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కే ఏకైక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డేనని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా రాఫెల్ డీల్ అవినీతిపై చర్చ జరుగుతుంటే జగన్ మాత్రం స్పందించడం లేదన్నారు. 

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు వేల కిలోమీటర్లు కాదు, 30వేల కిలోమీటర్లు నడిచిన సీఎం కాలేరని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కే ఏకైక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డేనని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా రాఫెల్ డీల్ అవినీతిపై చర్చ జరుగుతుంటే జగన్ మాత్రం స్పందించడం లేదన్నారు. 

జైలుకు వెళ్ళాల్సివస్తుందన్న భయంతోనే జగన్ రాఫెల్ డీల్ పై నోరుమెదపడం లేదని ప్రత్తిపాటి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నా నిలదీయలేని స్థితిలో జగన్ ఉన్నారని విమర్శించారు. 

చివరికి సీఎం చంద్రబాబు యూఎన్ వో సమావేశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రకృతి వ్యవసాయంపై ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో ప్రతిపక్ష నేతలున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బతియ్యలేరన్నారు. 

click me!