నాగార్జున జగన్ పార్టీలో చేరుతారా?

By pratap reddyFirst Published Sep 25, 2018, 8:47 AM IST
Highlights

ఈసారి మరోసారి అక్కినేని నాగార్జున రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాగార్జున సన్నిహితులు. 

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నటుడు నాగార్జున అక్కినేని రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే ప్రచారం సాగుతోంది. గతంలో కూడా నాగార్జునతో పాటు అమల అక్కినేని రాజకీయాల్లోకి అడుగు పెడుతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ, అలాంటిదేమీ జరగలేదు.

ఈసారి మరోసారి అక్కినేని నాగార్జున రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాగార్జున సన్నిహితులు. దాంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. 

అయితే, నాగార్జున ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన దేవదాస్ త్వరలో విడుదల కానుంది. మరోవైపు సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ తీయడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. వాటికి తోడు మరో రెండు సినిమాల్లో నటించడానికి కూడా సిద్ధపడినట్లు చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే, తన ఇద్దరు కుమారులను తెలుగు సినీ పరిశ్రమలో నిలబెట్టే కార్యక్రమానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. వారి కెరీర్ పై దృష్టి పెట్టడమే తన ముందున్న ప్రథమ కర్తవ్యమని నాగార్జున ఓ సందర్భంలో అన్నారు. అంతేకాకుండా తనకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేశారు. 

click me!