ముద్రగడ నిర్ణయం: కాపు సంఘం అప్రమత్తం, బొండా ఉమాకు నో చాన్స్

Published : Jul 14, 2020, 05:04 PM ISTUpdated : Jul 14, 2020, 05:06 PM IST
ముద్రగడ నిర్ణయం: కాపు సంఘం అప్రమత్తం, బొండా ఉమాకు నో చాన్స్

సారాంశం

కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించిన నేపథ్యంలో కాపు సంఘం నాయకులు అప్రమత్తమయ్యారు. తామంతా ముద్రగడ పద్మనాభం నాయకత్వంలోనే నడుస్తామని స్పష్టం చేశారు.

భీమవరం: కాపు ఉద్యమం నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర కాపు సంఘం నాయకులు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో సమావేశమయ్యారు. కాపు ఉద్యమం కోసం తాను 13 జిల్లాల కాపు నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వర రావు ప్రకటించిన నేపథ్యంలో వాళ్లు అప్రమత్తమైనట్లు కనిపిస్తున్నారు. ఉద్యమం మరొకరి చేతుల్లోకి వెళ్లకూడదని వారు అభిప్రాయపడుతున్నట్లు అర్థమవుతోంది. 

కాపులందరికీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ముద్రగడ నాయకత్వంలోనే నడుస్తామని చెప్పారు తమలోని కొంత మంది నాయకుల మాటల వల్ల ముద్రగడ పద్మనాభం మనస్తాపానికి గురయ్యారని వారన్నారు. తాముంతా ఏకమై ముద్రగడ నాయకత్వంలోనే ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు త్వరలో 13 జిల్లాలో నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

Also Read: జగన్ కు చిక్కులు: చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతుల్లోకి కాపు ఉద్యమం

కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి తప్పుకోవాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వర రావు స్పందించిన విషయం తెలిసిందే. కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని ముద్రగడ పద్మనాభం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయం తీసుకుంటూ ఆయన కాపు సామాజికవర్గానికి ఓ బహిరంగ లేఖ రాశారు. 

ఉద్యమం నుంచి ముద్రగడ పద్మనాభం తప్పుకోవడం సరైంది కాదని బొండా ఉమామహేశ్వర రావు అన్నారు. నాయకత్వం వహించేవారిపై విమర్శలు సహజమేనని ఆయన సోమవారం మీడియా సమావేశంలో అన్నారు. ముద్రగడపై సోషల్ మీడియాలో విమర్శలు చేసేది వైసీపీ వాళ్లేనని ఆయన అన్నారు. 

Also Read: షాకింగ్: కాపు రిజర్వేషన్ ఉద్యమంపై ముద్రగడ సంచలన లేఖ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ కాపు రిజర్వేషన్లపై లేఖ రాసిన తర్వాతనే సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వే,న్లను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన చెప్పారు. ఇది కాపులకు నిజంగా ద్రోహమేనని ఆయన అన్నారు. 

కాపు జాతి కోసం, రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ముందుకు రావాలని ఆయన కోరారు. త్వరలో 13 జిల్లాలో కాపు నాయకులతో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తానని బొండా ఉమా చెప్పారు.  

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!