జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: టెన్త్ విద్యార్థులను పాస్ చేస్తూ జీవో జారీ

By narsimha lodeFirst Published Jul 14, 2020, 3:32 PM IST
Highlights

రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులంతా పాసైనట్టుగా ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.కరోనా నేపథ్యంలో ఏపీలో టెన్త్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థులంతా పాస్ అయినట్టేనని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.


అమరావతి:  రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులంతా పాసైనట్టుగా ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.కరోనా నేపథ్యంలో ఏపీలో టెన్త్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థులంతా పాస్ అయినట్టేనని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.

మూడు దఫాలు ఏపీలో టెన్త్ పరీక్షలను వాయిదా వేశారు. ఈ  నెలలో పరీక్షలు నిర్వహిల్సి ఉంది. కానీ, పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఈ ఏడాది మార్చి 23 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించాలని తొలుత షెడ్యూల్ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మార్చి 31 నుండి ఏప్రిల్ 17వరకు పరీక్షలను వాయిదా వేశారు.

రాష్ట్రంలో మార్చి 9వ తేదీ నుండి మార్చి 29వ తేదీ వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని షెడ్యూల్ ప్రకటించారు.
అయితే కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేదు.కరోనాను దృష్టిలో ఉంచుకొని రెండు సార్లు వాయిదా పడిన టెన్త్ పరీక్షలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

also read:టెన్త్ విద్యార్థులకు మెమోలు: ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు

పేపర్లను తగ్గించి ఏడు రోజుల్లో పరీక్షలు పూర్తయ్యేలా నిర్ణయం తీసుకొంది. జూలై 10వ తేదీ నుండి 17వరకు పరీక్షలు పూర్తి చేయాలని ప్లాన్ చేసింది. కానీ కరోనాను పురస్కరించుకొని ఈ దఫా కూడ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు తేగేసి చెప్పారు. దీంతో పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం. 

ఎస్ఎస్‌సీ పరీక్షలకు ఫీజు కట్టి హాల్ టిక్కెట్లు  పొందిన వారంతా పాసైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సారి ఎలాంటి గ్రేడింగ్ ఉండదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.


 

click me!