KA Paul : ఏపీ సీఎం జగన్ ను కలిసేందుకు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆయనను తాడేపల్లి క్యాంప్ ఆఫీసులోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. అపాయింట్ మెంట్ ఉంటేనే లోపలికి వెళ్లనిస్తామని తేల్చి చెప్పారు.
KA Paul : ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు ఏపీ సీఎం జగన్ నివాసం వద్ద మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. సీఎం ను కలిసేందుకు ఆయన తాడేపల్లి లోని సీఎం క్యాంపు ఆఫీసుకు వచ్చారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేనిదే లోపలకు వెళ్లనివ్వబోమని తేల్చి చెప్పారు.
భారత్ మాకు ‘కాల్ 911’ వంటిది.. నమ్మకమైన మిత్రదేశం - మల్దీవుల మాజీ మంత్రి
దీంతో ఆయన సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద ఎదురు చూశారు. సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చాయని అన్నారు. ప్రజా సమస్యలపై సీఎం తో చర్చించాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల్లో కలసి పనిచేద్దామని సీఎంకు చెప్పేందుకు వచ్చానని చెప్పారు. సీఎం అపాయింట్ మెంట్ కోసం ఈ రోజు మొత్తం వేచి చూస్తానని తెలిపారు. అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తానని, లేకపోతే శపిస్తానని అన్నారు.
అంతకు ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కేఏ పాల్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు చివరి దశలో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్నికలు నిర్వహించిన రోజే ఫలితాలను కూడా ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో కోవిడ్ మళ్లీ పెరుగుతోందని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
భక్తిని చూపించండి.. అనవసర ప్రకటనలు చేయొద్దు - బీజేపీ నేతలకు ప్రధాని సూచన
ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. వంగవీటి రంగాను చంపిన పార్టీలో కలవకూడదని జనసేన అధినేతను అభ్యర్థించారు. తన విష ప్రయోగం చేసిన, దేవుడి దయతో, డాక్టర్ల సాయంతో ఆరోగ్యంగా బయటపడ్డానని చెప్పారు. విషయ ప్రయోగంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.