విపక్ష పార్టీలపై వైఎస్ఆర్‌సీపీ సర్కార్ పెడుతున్న అక్రమ కేసులపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.
విజయవాడ: ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.
మంగళవారంనాడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి భేటీ అయ్యారు. విజయవాడలోని ఓ హోటల్ లో ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
undefined
ఈ భేటీ ముగిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని సీఈసీ నిర్ణయం తీసుకుందన్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అన్ని అంశాలు సీఈసీకి దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు.చంద్రగిరిలో దాదాపు లక్ష కు పైగా దొంగ ఓట్లు నమోదైన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఈ దొంగ ఓట్లలో కొన్నింటిని ఆమోదించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు.దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని సీఈసీకి ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు.
also read:ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని హమీ: సీఈసీతో భేటీ తర్వాత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం కూడ చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎన్నికల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఈసీ దృష్టికి తెచ్చారన్నారు.