బోగస్ ఓట్లపై టీడీపీ తప్పుడు ఫిర్యాదు: చర్యలు తీసుకోవాలని కోరామన్న విజయసాయి రెడ్డి

By narsimha lode  |  First Published Jan 9, 2024, 1:26 PM IST

సీఈసీ రాజీవ్ కుమార్ తో  వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మార్గాని భరత్ లు ఇవాళ సమావేశమయ్యారు.



విజయవాడ:  బోగస్ ఓట్లపై  తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని  సీఈసీ  రాజీవ్ కుమార్ ను కోరినట్టుగా  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కోరారు.

మంగళవారంనాడు సీఈసీ రాజీవ్ కుమార్ బృందంతో  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) ఎంపీలు విజయసాయి రెడ్డి, మార్గాని భరత్  లు  విజయవాడలో భేటీ అయ్యారు.  ఈ భేటీ ముగిసిన తర్వాత విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించినట్టుగా  విజయసాయి రెడ్డి  చెప్పారు.గుర్తింపు లేని జనసేనను ఈ సమావేశానికి ఎందుకు ఆహ్వానించారని తాము సీఈసీని అడిగినట్టుగా  చెప్పారు.పొత్తులో భాగంగా జనసేనను ఆహ్వానించాలని కోరారన్నారు. 
గ్లాస్ గుర్తు అనేది ఒక సాధారణ గుర్తుగా పేర్కొన్నారు.అలాంటి సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాలలో పోటీ చేయటం అనేది చట్ట విరుద్ధమని విజయసాయి రెడ్డి  చెప్పారు. 

Latest Videos

undefined

also read:ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని హమీ: సీఈసీతో భేటీ తర్వాత చంద్రబాబు

బోగస్ ఓట్లపై  కోనేరు సురేష్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారన్నారు. కోనేరు సురేష్   టీడీపీ లో కీలకంగా వ్యవహారిస్తున్నాడన్నారు. రాష్ట్రంలోని 175స్థానాలలో ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయని కోనేరు సురేష్ కు ఎలా తెలుసునని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.కోనేరు సురేష్ ఇచ్చిన ఫిర్యాదే  బోగస్ అని  విజయ సాయిరెడ్డి  చెప్పారు.కర్నూల్ జిల్లా లో 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయని సురేష్ ఫిర్యాదు చేశాడన్నారు. కానీ అక్కడ వెరిఫికేషన్ చేశాక 87శాతం నిజమైన ఓట్లు ఉన్నాయని గుర్తించారని  చెప్పారు.

also read:వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది: సీఈసీతో భేటీ తర్వాత పవన్

అన్నమయ్య జిల్లాలో 40,358,విశాఖ లో 38వేల వరకు బోగస్ ఓట్లున్నాయని ఫిర్యాదులు చేస్తే  ఎన్నికల సంఘం అధికారుల విచారణలో చాలా వరకు  నిజమైన ఓటర్లున్నారని తేలిందని విజయసాయి రెడ్డి వివరించారు. ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన సురేష్ పై చర్యలు తీసుకోవాలని  విజయసాయి రెడ్డి కోరారు.డిసెంబర్ 2023 లో ఎలక్షన్ కమిషన్ కి తమ పార్టీ ఓ ఫిర్యాదు చేసిన విషయాన్ని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు.  ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైల్ పేరుతో వోటర్ల వారి  సమాచారాన్ని తెలుగు దేశం పార్టీ సేకరిస్తుందని  తాము ఫిర్యాదు చేసినట్టుగా ఆయన తెలిపారు.

click me!