ఏపీలో కరోనా రికవరీ రేటు 51.49 శాతం.. యాక్టీవ్ కేసులు తగ్గుదల: జవహర్ రెడ్డి

By Siva Kodati  |  First Published May 12, 2020, 7:50 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం 51.49 శాతంగా ఉందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. 


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం 51.49 శాతంగా ఉందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడంతో యాక్టీవ్ కేసులు తగ్గుముఖం పడుతోందన్నారు.

మరణాల శాతం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా జవహర్ రెడ్డి తెలిపారు. హైరిస్క్ కేటగిరీ వారిని రక్షించుకోవాల్సి ఉందని, ఇతర వ్యాధులున్న వృద్ధులను రక్షించుకోవాలని ఆయన కోరారు.

Latest Videos

undefined

Also read:కర్నూల్‌లో డెడ్ బాడీల తారుమారు: త్రిసభ్య కమిటి ఏర్పాటు, విచారణకు ఆదేశం

అత్యవసర కేసుల్లో ప్లాస్మా సేకరిస్తున్నామని.. దీనిలో భాగంగా స్విమ్స్, కర్నూలు జీజీహెచ్‌‌లో ప్లాస్మా సేకరిస్తున్నట్లు జవహర్ రెడ్డి తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని ఆయన చెప్పారు.

వలస కార్మికులు, బయటి నుంచి వచ్చే వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని... అలా వచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని జవహర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికి వచ్చిన కార్మికులకు పరీక్షలు చేస్తుంటే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు.

Also Read:కర్నూల్‌లో డెడ్‌బాడీల తారుమారు: కరోనా పాజిటివ్‌కి బదులుగా మరో మృతదేహం అప్పగింత

కర్నూలుకు చేరుకున్న 37 మందికి పాజిటివ్ వచ్చిందని.. అనంతపురం జిల్లాలోనూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారికి కరోనా పరీక్షలు చేస్తున్నామని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారిలో చిత్తూరు, నెల్లూరు నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు. ప్రధాని సూచనల మేరకు లాక్‌డౌన్ నుంచి బయటకు వచ్చే వ్యూహాలు తయారు చేస్తున్నామని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. 

click me!