కర్నూల్‌లో డెడ్ బాడీల తారుమారు: త్రిసభ్య కమిటి ఏర్పాటు, విచారణకు ఆదేశం

Published : May 12, 2020, 06:12 PM IST
కర్నూల్‌లో డెడ్ బాడీల తారుమారు: త్రిసభ్య కమిటి ఏర్పాటు, విచారణకు ఆదేశం

సారాంశం

కర్నూల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో డెడ్ బాడీల తారుమారు ఘటనపై విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్.


కర్నూల్: కర్నూల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో డెడ్ బాడీల తారుమారు ఘటనపై విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్.

కర్నూల్ జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీలో కరోనా పాజిటివ్  ఉన్న వ్యక్తి కుటుంబానికి కరోనా నెగిటివ్ డెడ్ బాడీ ని అందించారు. మార్చురీలో కరోనా నెగిటివ్ సోకిన మృతదేహం మార్చురీలో లేదు. 

మృతదేహం కోసం బంధువులు మంగళవారం నాడు ఉదయం ఆందోళనకు దిగారు. దీంతో మృతదేహాల తారుమారు విషయం వెలుగు చూసింది. ఈ విషయమై మీడియాలో కథనాలు రావడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది.

also read:కర్నూల్‌లో డెడ్‌బాడీల తారుమారు: కరోనా పాజిటివ్‌కి బదులుగా మరో మృతదేహం అప్పగింత

ఈ ఘటనను జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ సీరియస్ గా తీసుకొన్నారు. మార్చురీలో డెడ్ బాడీలు ఎలా తారుమారు అయ్యాయనే విషయమై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

జిల్లా ఆసుపత్రి సూపరింటెండ్, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి, కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ లతో కమిటిని ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. వీలైనంత త్వరగా ఈ కమిటి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ఈ నివేదిక ఆధారంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నారు కలెక్టర్. 

కర్నూల్ జిల్లాలో కూడ కరోనా పాజిటివ్ రోగుల మృతదేహాలను రోడ్డు పక్కనే పూడ్చారు. ఈ విషమయై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కరోనా కట్టడి విషయంలో అధికారులు సక్రమంగా వ్యవహరించలేదనే నెపంతో మున్సిపల్ కమిషనర్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే