పవన్ కళ్యాణ్‌పై తిరుగుబాటు: అసెంబ్లీలో మూడు రాజదానులకు జై కొట్టిన రాపాక

By narsimha lode  |  First Published Jan 20, 2020, 4:12 PM IST

ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదనకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మద్దతు ప్రకటించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను జనసేన వ్యతిరేకించింది. ఈ బిల్లును వ్యతిరేకించాలని పవన్ కళ్యాణ్ కోరారు. కానీ, రాపాక వరప్రసాద్ దీనికి విరుద్దంగా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకొంది. 


అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వ్యతిరేకంగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏపీ అసెంబ్లీలో ప్రసంగించారు. మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా ప్రజలు ఉన్నారని రాపాక వరప్రసాద్ ప్రకటించారు.మూడు రాజదానుల నిర్ణయాన్ని జనసేన సమర్ధిస్తోందని రాపాక వరప్రసాద్ ప్రకటించారు. 

Also read:ఆ రెండు బిల్లులకు వ్యతిరేకించాలి: రాపాక వరప్రసాద్‌కు పవన్ లేఖ

Latest Videos

undefined

Also read:పవన్‌కు షాక్: జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రసంగించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలనే ఉద్దేశ్యంతో పాలన వికేంద్రీకరణ బిల్లును తీసుకురావడాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్  సమర్ధించారు.

మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకించడం సరికాదన్నారు  ప్రజల అభిప్రాయాన్ని తాను అసెంబ్లీలో కూడ చెబుతున్నట్టుగా చెప్పారు. మూడు రాజధానులపై ఓటింగ్ పెడితే వాస్తవం బయటపడుతోందని రాపాక వరప్రసాద్ చెప్పారు.

ఏపీలో జగన్ సీఎంగా విజయం సాధించిన  తర్వాత పలు  పథకాలను ప్రవేశపెట్టారన్నారు.ఇన్ని పథకాలకు నిధులు ఎక్కడి నుండి వస్తాయో అర్ధం కాలేదన్నారు.  వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడ ఇదే అనుమానాలను వ్యక్తం చేశారు.

చెప్పినట్టుగానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించిన ఘనత  జగన్‌కు దక్కిందన్నారు. అనుభవం లేదని జగన్‌పై కొందరు విమర్శలు చేశారని పరోక్షంగా టీడీపీతో పాటు ఇతర పార్టీల విమర్శలను ఆయన పరోక్షంగా దెప్పిపొడిచారు.

ప్రజలకు సేవ చేయాలనే  థృక్పథం ఉన్నందునే వైఎస్ జగన్  నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, పాలనా వికేంద్రీకరణ, అమ్మఒడి లాంటి పథకాలను తీసుకొచ్చారని రాపాక వరప్రసాద్ ప్రశంసలతో ముంచెత్తారు.

అధికారంలోకి వచ్చిన సమయం నుండి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నాలు చేశారని అదే థృక్పథంలో పనిచేస్తున్నారని  రాపాక వరప్రసాద్ చెప్పారు.జగన్ చేస్తున్న ఈ కార్యక్రమాలను ప్రజలు ఎప్పుడూ సపోర్టు చేస్తున్నారని రాపాక వరప్రసాద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాజధానులకు అనుకూలంగానే ప్రజలు ఉన్నారని రాపాక వరప్రసాద్ చెప్పారు.  ప్రజా భిప్రాయం మూడు రాజధానులకు అనుకూలంగా ఉందని రాపాక వరప్రసాద్ చెప్పారు.

మూడు రాజధానులు ఉండాలి, రాష్ట్రం అభివృద్ది చెందాలనే ఉద్దేశ్యం ప్రజలకు ఉందని వరప్రసాద్ చెప్పారు. రాష్ట్రం కోసం పనిచేస్తున్న యువసీఎం జగన్‌కు తాము మద్దతిస్తున్నట్టుగా  రాపాక వరప్రసాద్ చెప్పారు.


 

 

click me!