విజన్ 2020 అనే చంద్రబాబు పరిస్థితి ఇప్పుడేమైంది? కన్నబాబు సెటైర్లు

By telugu teamFirst Published Jan 20, 2020, 3:14 PM IST
Highlights

చంద్రబాబు గతంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు అప్పుడప్పుడే హైద్రాబాదులో అడుగుపెడుతున్న వేళ, ప్రపంచ బ్యాంకుతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్న కాలంలో ఆయన తరచూ విజన్ 2020 అని మాట్లాడుతుండేవాడు. అదే విజన్ 2020ను ఉద్దేశిస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టేందుకు నేడు అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుగ్గన, బొత్స మాట్లాడిన తరువాత కురసాల కన్నా బాబు మాట్లాడారు. 

కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రతి ప్రాంతానికి ప్రత్యేక ఆకాంక్షలు ఉంటాయని చెబుతూనే... చంద్ర బాబు నాయుడు ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. చంద్రబాబు గతంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు అప్పుడప్పుడే హైద్రాబాదులో అడుగుపెడుతున్న వేళ, ప్రపంచ బ్యాంకుతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్న కాలంలో ఆయన తరచూ విజన్ 2020 అని మాట్లాడుతుండేవాడు. 

అదే విజన్ 2020ను ఉద్దేశిస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. విజన్ 2020 అంటూ అప్పట్లో పదే పదే చెప్పే చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు 2020కు వచ్చేసరికి ఏమయిందో చూడమంటూ ఆయన జోలె పట్టుకొని చందాలు ఆడుకుంటున్న విషయాన్నీ చెప్పకనే చెప్పారు. 

Also read; మీ పత్రికలు రాస్తున్నాయి కదా: అచ్చెన్నపై వైఎస్ జగన్ సెటైర్

ఒక్కసారిగా ఈ సెటైరును వేయగానే వైసీపీ సభ్యులంతా గొల్లుమన్నారు. ఇక అమరావతి గురించి అప్పట్లో ఈనాడు పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసాన్ని చదువుతూ, ఇది అర్థం పర్థంలేని వ్యాసమంటూ చదువుతూ ఎద్దేవా చేసారు. 

అమరావతి  వల్ల భారత్ కు ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు బలపడతాయని,  వ్యాపారాలు పెరుగుతాయి అంటూ అర్ధంపర్థం లేని వార్తలు టిడిపి అనుబంధ పత్రికలు రాస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.

Also read: బాబు రాజధాని గ్రాఫిక్స్, 35 ఏళ్ళు పడుతుంది: మంత్రి కన్నబాబు

దేశంలోనే చక్రం తిప్పే స్థాయి నుండి చంద్రబాబు 29 గ్రామాలకు పరిమితమయ్యారని...  ఇంతకన్నా రాజకీయ పతనం ఏముంటుందని ఎద్దేవా చేశారు. జగన్ కు ఇంకా ఆయనపై ఎందుకు కోపం వుంటుందన్నారు. 

 చంద్రబాబు పరిస్థితి మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్లుగా వుందని ఎద్దేవా చేశారు. మొదట ఇసుక, ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు అమరావతి ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని విమర్శించి చివరకు తోకమువడం ప్రతిపక్ష  పార్టీకి అలవాటయ్యిందన్నారు.

click me!