విశాఖ గర్జన కు ప్రజలనుంచి సరైన స్పందన లేకపోవడంతోనే పవన్ కళ్యాణ్ టూర్ పై వివాదం చేస్తున్నారని జనసేన నేత పోతిన వెంకట మహేష్ పోలీసులపై మండిపడ్డారు.
విజయవాడ : జనసేనాదిపతికి వస్తున్న జనాదరణ తో వైసిపి వెన్నులో వణకు పుడుతోంది అని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ర్యాలీ ని అడ్డుకునేందుకు పాలకులు పోలీసులను అడ్డం పెట్టుకున్నారన్నారు. మంత్రుల కార్లపై దాడి కుట్ర పారకపోవడంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చారని, విశాఖ సిపి అధికార పార్టీ నేతల ఆదేశాలతో పని చేశారని, విశాఖ సీపీ శ్రీకాంత్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
undefined
విధుల్లో పోలీసుల నిర్లక్ష్య వైఖరి, చేతకానితనం కప్పిపుచ్చుకునేందుకే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. దాడి చేసి చంపాలనే ఉద్దేశం ఉంటే వేలమంది జనసేన పార్టీ కార్యకర్తల మధ్య వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు మంత్రులు,పెద్దలు దర్జాగా నడుచుకొని వెళ్లే వారా? ఫ్లైట్ ఎక్కగలిగేవారా? ప్రెస్మీట్లో పెట్టగలిగేవారా? అని ప్రశ్నించారు.
అసలు పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో అదే మార్గంలో మంత్రులు రావడం వెనుకే వైసిపి కుట్ర అర్ధం అవుతుంది అన్నారు. పవన్ కళ్యాణ్ గారిపైన జనసేన పార్టీపైన విషం చిమ్మాలని చూస్తున్నారన్నారు. ఘటన జరిగి 14 గంటలు గడుస్తున్నా కనీసం సీసీటీవీ ఫుటేజ్ కూడా విడుదల చేయలేకపోయారంటే.. అక్కడ తీవ్రమైన ఘటనేమి జరగలేదని అందరికీ అర్దం అవుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్నారని వైఎస్ఆర్సిపి మంత్రులు ఎమ్మెల్యేలు అక్కసు వెళ్ళగకుతున్నారన్నారు.
బెజవాడ కోర్టు సిబ్బంది నిర్లక్ష్యం.. చెత్త బుట్టలో న్యాయవాదులు దాఖలు చేసిన కాగితాలు...
గతంలో లాంగ్ మార్చ్ స్టీల్ ప్లాంట్ బహిరంగ సభల్లో లక్షలాదిమంది పాల్గొని విజయవంతం చేశారని గుర్తు చేశారు. నేడు జరిగే ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేస్తారనే సమాచారం ఉండబట్టే ఇటువంటి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదిలా ఉండగా, జనవాణి ప్రోగ్రాం వాయిదా వేస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి అన్నారు. జనసేన సభ్యులు 100 మందిని అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ఏ కార్యక్రమాలో చేయాలో వైసీపీ వాళ్లకు ఎందుకు.. వాళ్ల పర్మిషన్ తీసుకోవాలా? అంటూ ఫైర్ అయ్యారు. గంజాయి సాగు చేసేవాళ్లను, దానికి సపోర్ట్ చేసేవాళ్లను వదిలేసి.. సామాన్యుల గొంతును వినిపించడానికి వచ్చిన జనసేనను ఇలా ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు.
కాగా, విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రులు, వైసీపీ నాయకులపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జనసేన నాయకులను బాధ్యులను చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. కోన తాతారావు, పీతల మూర్తి యాదవ్, విశ్వక్ సేన్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్ రెడ్డి, పివిఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నీయక్, కీర్తీస్, పాలవసల యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజును పోలీసులు అరెస్టు చేశారు.