అరెస్టైన కార్యకర్తలను విడుదలచేయాలి,విశాఖలో జనవాణి వాయిదా:పవన్ కళ్యాణ్

By narsimha lode  |  First Published Oct 16, 2022, 11:22 AM IST

అరెస్ట్   చేసిన జనసేన కార్యకర్తలను  విడుదల చేసేవరకు జనవాణి కార్యక్రమాన్నినిర్వహించబోమని  పవన్ కళ్యాణ్  చెప్పారు. పోలీసులు నిన్నవ్యవహరించిన తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
 


విశాఖపట్టణం:పోలీసులు అరెస్ట్ చేసిన జనసేన  కార్యకర్తలను విడుదల చేసేవరకు జనవాణి కార్యక్రమాన్నితాము నిర్వహించబోమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.ఆదివారంనాడు జనసేన చీఫ్ పవన్  కళ్యాణ్ విశాఖపట్టణంలో  మీడియాతో మాట్లాడారు. విశాఖపట్టణంలో జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతితీసుకున్న 15 మందిని పోలీసులు అరెస్ట్  చేశారన్నారు.

ఇప్పుడు తాను నిర్వహిస్తున్న మీడియా సమావేశానికి వస్తున్న నేతలను కూడ  పోలీసులు అరెస్ట్ చేశారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ర్యాలీతో  సంబంధం లేనివారిని పోలీసులు  అరెస్ట్ చేశారని పవన్ కళ్యాణ్  చెప్పారు.సామాన్యులైనందున తాము వైసీపీబెదిరింపులను భరిస్తామని పవన్  కళ్యాణ్ చెప్పారు.తమకు అధికారంలేదు,చిన్నమనుషులం  కాబట్టి  భరిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.

Latest Videos

undefined

ఈ పోరాటం  ఎక్కడికి  వెళ్తుందో  తెలియదన్నారు.తమ  పార్టీ క్యాడర ను  ఎలా రక్షించుకోవాలనే విషయమై  పార్టీ  నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వివరించారు.తమ పార్టీ నేతలపై ఐపీసీ 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారన్నారు.హత్యాయత్నం  చేసిన వారిపై307సెక్షన్ కింద  కేసులు నమోదు చేస్తారన్నారు.ర్యాలీకి  అనుమతి తీసుకున్నవారిపై  హత్యాయత్నం కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలను విడుదల చేసే వరకు ఇక్కడే ఉంటారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే  ఇంకా దానిపై నిర్ణయం తీసుకోవాల్సిఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

విశాఖలో మూడు రాజధానులకు  మద్దతుగా విశాఖ గర్జన కంటే మూడు మాసాల ముందే  విశాఖలో జనవాణి కార్యక్రమం ఖరారైందని పవన్ కళ్యణ్ చెప్పారు.ప్రభుత్వం  ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు  మా వద్దకు ఎందుకు  వస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జనవాణి కార్యక్రమాల్లో ఇప్పటివరకు మూడువేల పిటిషన్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజలు ఇచ్చిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతి  పత్రాలు  ఇస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.

alsoread:జగన్ సర్కార్ లో వికేంద్రీకరణ ఎక్కడుంది?పవన్ కళ్యాణ్ ఫైర్

 ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న వ్యక్తి కిందే ఇప్పుడు పోలీసులు పని చేస్తున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.నిన్నరాత్రి మొత్తం తమను  అరెస్ట్  చేస్తారని ప్రచారంసాగిందన్నారు.తాను బస చేసిన హోటల్ లో  పోలీసులు మోహరించిన విషయాన్నిపవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.ఇవాళ ఉదయం కూడ పోలీసు ఉన్నతాధికారుల బృందం వచ్చి తనతో చర్చించిందని పవన్ కళ్యాణ్ చెప్పారు.పోలీసులపై గౌరవంతోనే తాము నిన్న  పోలీసులతో గొడవకు దిగలేదని పవన్  కళ్యాణ్ చెప్పారు.

తాను ఇక్కడ దేశానికి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నామా  అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.నేరస్థులకు కొమ్ముకాయండి,ప్రజాసమస్యలపై  ప్రశ్నించే వాళ్ల గొంతునొక్కేయండి అని  పవన్ కళ్యాణ్ పోలసులతీరుపై మండిపడ్డారు.పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ కోరారు.ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి,రేపు పోతాయన్నారు.35ఏళ్ల పాటుసర్వీసులో ఉండాల్సిన  ఉద్యోగులు చట్ట ప్రకాంరగా వ్యవహరించాలని  పవన్ కళ్యాణ్ సూచించారు.
 

click me!