జగన్ ప్రభుత్వంలో వికేంద్రీకరణ ఎక్కడుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.మంత్రులకు అసలుఅధికారులున్నాయా అని ఆయన అడిగారు.జగన్ ఒక్కడేనిర్ణయాలుతీసుకంటారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
విశాఖపట్టణం:సీఎం మారినప్పుడల్లా రాజధాని మారుతుందా? అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వైసీపీని ప్రశ్నించారు. వికేంద్రీకరణ అని చెబుతున్న సీఎం జగన్ అధికారాన్ని ఎందుకు వికేంద్రీకరించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
ఆదివారంనాడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు.జగన్ కేబినెట్లో ఉన్న మంత్రులు,డిప్యూటీ సీఎంలకు అసలు అధికారులున్నాయా అని ఆయన ప్రశ్నించారు. జగన్ ఒక్కడే అధికారం చెలాయించాలి కానీ, మూడు రాజధానులు కావాలంటున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో అధికార వికేంద్రీకరణ ఎక్కడుందని పవన్ కళ్యాణ్ అడిగారు..పేరుకే మంత్రులు మంత్రులుగా ఉన్నారన్నారు.అధికారం ఉన్నవాళ్లు గర్జించడం ఏమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.జగన్ ఒక్కడే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ రకమైన ఇబ్బందులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో నేరపూరితమైన వ్యక్తుల వల్ల ఈ పరిస్థితి నెలకొందన్నారు.మీ లాంటి క్రిమినల్స్ ను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలుచేశారు. తాము ప్రజాస్వామ్యాన్నినమ్ముతాం,కానీ కులస్వామ్యాన్ని,ఏకస్వామ్యాన్ని నమ్మమని పవన్ కళ్యాణ్ చెప్పారు.
undefined
తమ పార్టీ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో వైసీపీ నేతలు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.తాను పోలీస్ కుటుంబం నుండి వచ్చినవాడిని అని ఆయన చెప్పారు.పోలీసులంటే తనకు చాలా గౌరవం ఉందన్నారు.తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ కార్యక్రమాలు చేయడం లేదన్నారు.ఎన్నికల్లోనే పోటీపడదామని పవన్ కళ్యాణ్ వైసీపీ సూచించారు.
విశాఖలో మూడు రాజధానులకు మద్దతుగా ప్రకటించిన విశాఖ గర్జన కంటే మూడు మాసాల ముందే విశాఖలో జనవాణి కార్యక్రమం ఖరారైందని పవన్ కళ్యణ్ చెప్పారు.ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు మా వద్దకు ఎందుకు వస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జనవాణి కార్యక్రమాల్లో ఇప్పటివరకు మూడువేల పిటిషన్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజలు ఇచ్చిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.
జనసేన కార్యక్రమాన్నిఅడ్డుకోవడం కోసం వైసీపీ ఉద్దేశ్యపూర్వకంగావ్యవహరించిందన్నారు.గొడవలుసృష్టించేందుకే వైసీపీ నేతలుప్రయత్నించారన్నారు. కోనసీమలాంటి గొడవలు చేయాలనే ఉద్దేశ్యం వైసీపీ నేతల్ో ఉందన్నారు.కోడికత్తి కేసు వాళ్లు చేయించుకొన్నదే కదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.కోడికత్తి కేసు ఇంకా ఎందుకు తేలలేదో చెప్పాలని పవన్ కళ్యాణ్ అడిగారు. మంత్రుల కార్లపై దాడి వైసీపీ పేనని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.ఉత్తరాంధ్రలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని వైసీపీ కోరుకుంటుందన్నారు.మంత్రుల పర్యటనలో పోలీసులు ఎందుకు భద్రత కల్పించలేదో చెప్పాలన్నారు.
అమరావతిని రాజధానిగా అందరూ ఒప్పుకున్నారన్నారు.విశాఖపట్టణం విశ్వనగరమని అని ఆయన చెప్పారు.
తాను విశాఖలో నటనను నేర్చుకొన్నానని మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అసూయ ఉన్నట్టుగా కన్పిస్తుందన్నారు.విడాకులు తీసుకుని మీరు కూడ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు సూచించారు.ఉత్తరాంధ్ర, రాయలసీమపై అంత ప్రేమ ఉందా అనిజగన్ ను ప్రశ్నించారు.రాయలసీమ నుండి ఇంత మంది సీఎంలు వచ్చినా కూడా ఎందుకు ఆ ప్రాంతం వెనుకబడి ఉందో చెప్పాలన్నారు
also read: విశాఖలో ఉద్రిక్తత: పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఆందోళన, రంగంలోకి పోలీసులు
.సామాన్యుల వాణిని విన్పించేందుకు పవన్ కళ్యాణ్ విశాఖపట్టణానికి వచ్చారని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. నిన్నవిశాఖ పట్టణంలో తమ కార్యక్రమానికి పోలీసులు అడుగడుగున ఆటంకం కల్గించారని నాదెండ్ల మనోహర్ చెప్పారు.జనవాణి కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసుల వినతికి అనుకూలంగా తాము సహకరించినట్టుగా నాదెండ్ల మనోహర్ చెప్పారు.