విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను (vizag steel plant privatization) అడ్డుకోవాలని కోరుతూ జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నిరాహార దీక్ష ముగిసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను (vizag steel plant privatization) అడ్డుకోవాలని కోరుతూ జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నిరాహార దీక్ష ముగిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ...స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే బూతులు తిడతారంటూ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 152 మంది ప్రాణాలు తీసుకున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాలు చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామని.. ఈ ప్లాంట్ కేవలం పరిశ్రమే కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రైవేటీకరణ అంటే ఆ పోరాటానికి విలువ లేకుండా చేయడమేనని ఆయన అభివర్ణించారు.
నేను వెళ్లి కేంద్రంతో గొడవ పెట్టుకోవాలని వైసీపీ నేతలు చెబుతున్నారని.. గతేడాది బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అమరావతే రాజధానిగా వుండాలని కండీషన్ పెట్టాలని పవన్ చెప్పారు. బీజేపీ అగ్రనాయకత్వం కూడా అందుకు ఒప్పుకుందని ఆయన తెలిపారు. మొన్న తిరుపతి సభలో అమిత్ షా (amit shah) కూడా అమరావతే రాజధాని అని చెప్పారని పవన్ వెల్లడించారు. వైసీపీ ఇచ్చిన మాటకు కట్టుబడి లేదని.. వైసీపీ నేతలు మాకు శత్రువు కాదని, కానీ ఆ పార్టీ పాలసీలే మాకు శత్రువుని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ విలువలు లేని రాజకీయాలు చేస్తోందని పవన్ దుయ్యబట్టారు. జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యేని మీరు లాక్కున్నారని.. ఒక్క ఎమ్మెల్యేని గెలిపించిన నాకే కేంద్రం గౌరవం ఇస్తుంటే మీరేం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు.
undefined
Also Read:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: పవన్ సంచలన నిర్ణయం.. జగన్ సర్కార్‌పై దీక్షాస్త్రం
151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు వుండి మీరేం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం అందరూ ఏకతాటిపైకి రావాలని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడే దమ్ముందా అని పవన్ కల్యాణ్ సవాల్ చేశారు. తప్పు కేంద్రానిది కాదు.. అడిగే పద్ధతి లేదని ఆయన అన్నారు. చేతకాని వ్యక్తులు చట్టసభల్లో కూర్చోవడం దేనికంటూ ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే కేంద్రం ఎలా స్పందిస్తుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
అందరం ఒక్కటికాకపోతే సమస్యలు పరిష్కారం కావని పవన్ హితవు పలికారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. 22 మంది ఎంపీలు మాట్లాడితే శాసనసమవుతుందని పవన్ అన్నారు. చట్టసభల్లో తనకే సభ్యులుంటే తానే వెళ్లి మాట్లాడేవాడినని ఆయన స్పష్టం చేశారు. 2014లో ఓట్లు చీలొద్దనే పోటీ చేయలేదని.. 2024 ఎన్నికలు వచ్చే వరకూ భరించక తప్పదని పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 వచ్చాక అప్పుడు చెబుదామన్న ఆయన.. అధికారంలో వుండి స్టీల్ ప్లాంట్‌తో మాకు సంబంధం లేదంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.