స్వగ్రామంలో లాన్స్ నాయక్ సాయితేజకు కన్నీటి వీడ్కోలు: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

Published : Dec 12, 2021, 03:16 PM ISTUpdated : Dec 12, 2021, 04:06 PM IST
స్వగ్రామంలో లాన్స్ నాయక్ సాయితేజకు కన్నీటి వీడ్కోలు: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని నీలగరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు ఆదివారం నాడు జరిగాయి.  స్వగ్రామం ఎగువరేగడ గ్రామంలో సాయితేజ అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో నిర్వహించారు.

చిత్తూరు: తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి కొండల్లో   sulur helicopter crash హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ Saiteja  అంత్యక్రియలు ఆదివారం నాడు ఎగువరేగడ గ్రామంలో జరిగాయి. Chittor జిల్లా సరిహద్దు నుండి Eguva regada గ్రామానికి సుమారు 30 కి.మీ దూరం పాటు ర్యాలీ నిర్వహించారు. లాన్స్ నాయక్ సాయితేజ మృతదేహన్ని ఆర్మీ అధికారులు ఇవాళ  స్వగ్రామానికి తీసుకొచ్చారు. సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. 

also read:Sulur helicopter crash:ఎగువరేగడకి చేరుకొన్న సాయితేజ డెడ్‌బాడీ

స్వగ్రామంలో సాయితేజ మృతదేహన్న కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. బౌతిక కాయం ఎగువ రేగడ గ్రామానికి తరలిస్తున్న సమయంలో రోడ్డుకు ఇరువైపులా జాతీయ పతాకాన్ని చేతబూని  ప్రజలు  మృతదేహన్ని తిలకించారు. స్వగ్రామానికి లాన్స్ నాయక్ సాయితేజ మృతదేహం చేరుకోగానే గ్రామంలోని స్థలంలో సైనిక వందనంతో పాటు పోలీసులు గౌరవ వందనం చేశారు. ఆ తర్వాత మృతదేహన్ని సాయితేజ ఇంటికి తరలించారు. అప్పటికే సాయితేజ మృతదేహన్ని చూసిన తల్లీ దండ్రులు స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. కొడుకు మృతదేహన్ని చూసిన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత సాయితేజ last rites నిర్వహించారు

లవ్ యూ డాడీ అంటూ సాయితేజ ఫోటోను ముద్దాడిన కొడుకు

సాయితేజ ఫోటోను చేతబూని లవ్ యూ డాడీ అంటూ సాయితేజ ఫోటోను కొడుకు ముద్దాడాడు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకొన్నారు. ప్రమాదం జరిగిన రోజున ఉదయాన్నే  భార్యా పిల్లలతో సాయితేజ ఫోన్ లో మాట్లాడారు. ఫోన్ లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ మరణించారు. 

ఎగువరేగడలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన మోహన్, భువనేశ్వరి దంపతులకు సాయితేజ, మహేష్‌బాబు సంతానం. సాయితేజ స్థానికంగానే చదువుకున్నారు. 10వ తరగతి పూర్తి కాగానే  సైన్యంలో చేరారు. డిగ్రీ పూర్తి చేసి గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌కు హజరై 2012లో సైనికుడిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పారా కమెండో పరీక్ష రాసి 11వ పారా లాన్స్‌ నాయక్‌ హోదా దక్కించుకున్నాడు.  ఏడు నెలల క్రితమే జనరల్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా (PSO to the CDS) నియమితులయ్యారు. సాయితేజ సోదరుడు మహేష్‌బాబు కూడా సైన్యంలోనే ఉన్నారు.

సాయితేజకు భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ (5), దర్శిని (2) ఉన్నారు. అయితే కొద్ది నెలల క్రితమే సాయితేజ.. తన కొడుకు మోక్షజ్ఞ ప్రాథమిక విద్య కోసం గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలోని మదనపల్లె పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీకి తన భార్యాపిల్లలను మార్చారు. చివరి సారిగా వినాయకచవితికి సాయితేజ ఇంటికి వచ్చారు. జనవరిలో సంక్రాంతి పండగకు వస్తానని కుటుంబ సభ్యులతో తెలిపారు. సాయితేజ రోజు భార్య, పిల్లలతో ఫోన్‌లో మాట్లాడేవారు. బుధవారం కూడా సాయితేజ.. భార్యకు వీడియో కాల్ చేశారు. సాయి తేజ మృతిచెందారనే వార్త తెలియడంతో అతని స్వగ్రామం రేగడపల్లె‌లో విషాదఛాయలు నెలకొన్నాయి. సాయితేజ‌ తల్లిదండ్రులు, భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu