
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ముఖ్యంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం కానీ రాష్ట్రానికి ఉపాధి కోసం వలస వచ్చిన వీరంతా, ఇప్పుడు ఎలాంటి పనులు లేకపోవడంతో తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు.
రవాణా సదుపాయాలు లేకపోవడంతో వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్తున్న వీరి అవస్థలపై సోషల్ మీడియా కదిలిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం కార్మికుల ఇబ్బందులపై స్పందించారు. ఈ మేరకు గురువారం జనసేన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read:కరోనా ఎఫెక్ట్: బొమ్మను చూపి పోలీసులకు విశాఖ యువ జంట బురిడీ, షాకిచ్చిన కానిస్టేబుల్
‘‘ ఏ దేశ ఆర్ధిక పురోగతికైనా శ్రామికుల కష్టించే తత్వమే ప్రధాన ఇంధనం. కార్మిక లోకం శ్రమను గుర్తించి... గౌరవించడం అందరి బాధ్యత. మే డే సందర్భంగా ఆ బాధ్యతను మనం మరోసారి గుర్తు చేసుకోవాలి. యావత్ కార్మిక లోకానికి నా తరపున, జనసేన పార్టీ తరపున కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
కరోనా మూలంగా తలెత్తుతున్న పరిస్ధితుల ప్రభావం కార్మికులపై పడే ప్రమాదం ఉంది. ఆ క్లిష్ట కాలంలో వారి సమస్యలపై అందరూ సానుభూతితో స్పందించాలి. వారి ఉపాధికి చట్టబద్ధమైన రక్షణ కలిగించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఎంతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఈ చట్టాలు సమయంలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలి.
Also Read:కర్నూల్ మున్సిపల్ కమిషనర్‌గా ఐఎఎస్ అధికారి బాలాజీ నియామకం, రవీంద్రపై బదిలీ వేటు
అదే విధంగా అసంఘటిత రంగాల్లోని కార్మికుల సంక్షేమం గురించి తగిన చర్యలు చేపట్టాలి. అంతకుముందు అలనాటి బాలీవుడ్ నటుడు రిషి కపూర్ మరణంపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమ ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిందని, ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పవన్ అన్నారు.