కరోనా లాక్ డౌన్: ఏపీలోని రెడ్ గ్రీన్ జోన్ల పూర్తి లిస్ట్...

By Sree sFirst Published Apr 30, 2020, 6:26 PM IST
Highlights

రెండవ దఫా విధించిన లాక్ డౌన్ కూడా మరో మూడు రోజుల్లో ముగుస్తున్నందున కేంద్రం లాక్ డౌన్ సడలింపులను ఇవ్వనుందనే విషయం సుస్పష్టం. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను ఎత్తివేసేందుకు/సడలింపులు ఇచ్చేటందుకు కేంద్రం అన్ని రాష్ట్రాల కరోనా వైరస్ డాటాను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి రాష్ట్రంలోని జిల్లాలను రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. 

రెండవ దఫా విధించిన లాక్ డౌన్ కూడా మరో మూడు రోజుల్లో ముగుస్తున్నందున కేంద్రం లాక్ డౌన్ సడలింపులను ఇవ్వనుందనే విషయం సుస్పష్టం. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను ఎత్తివేసేందుకు/సడలింపులు ఇచ్చేటందుకు కేంద్రం అన్ని రాష్ట్రాల కరోనా వైరస్ డాటాను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి రాష్ట్రంలోని జిల్లాలను రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. 

కేసులు అధికంగా నమోదై, క్లస్టర్లు ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించారు. 14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాని పక్షంలో ఆ జిల్లా రెడ్ జోన్ నుంచి ఆరంజ్ జోన్లోకి వస్తుంది. 28 రోజులపాటు గనుక కేసు నమోదు కాకపోతే... అది గ్రీన్ జోన్ కిందకు వస్తుంది.  

లాక్ డౌన్ సడలింపులు గ్రీన్, ఆరంజ్ జోన్లకు కేంద్రం ఇవ్వనున్నట్టు తెలియవస్తుంది. రెడ్ జోన్లలో లాక్ డౌన్ ను కఠినంగా అలానే అమలు చేస్తారా లేదా అక్కడ కూడా కొన్ని సడలింపులు ఇస్తారా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. 

ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే... 13 జిల్లాల్లో 11 జిల్లాలను కేంద్రం రెడ్ జోన్లుగా గుర్తించింది. విజ్జయనగరం, శ్రీకాకుళం మినహా మిగిలిన అన్ని జిల్లాలు కూడా రెడ్ జోన్ల కింద వర్గీకరించారు. ఏపీలో ఆరంజ్, గ్రీన్ జోన్లు లేకపోవడం గమనార్హం. 

ఒకవేళ గనుక రెడ్ జోన్లలో లాక్ డౌన్ ను కొనసాగించాల్సిందే అని గనుక కేంద్రం అంటే... ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చి కూడా పెద్దగా ప్రయోజనం లేదు. 

ఇకపోతే కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ గురువారం నాడు సాాయంత్రం మీడియాతో మాట్లాడారు. కరోనా ప్రభావం లేని చోట్ల ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. 

 కరోనా కట్టడిలో కేంద్రంతో కలిసి నడవాలని రాష్ట్రాలను కోరుతున్నట్టుగా చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇంకా ఎక్కువగా నమోదౌతున్నట్టుగా ఆయన చెప్పారు.

కరోనా నుండి కోలుకొనే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. 78 శాతం కరోనా మరణాల్లో ఇతర వ్యాధుల ప్రభావం కూడ ఉందని ఆయన వివరించారు. ఇప్పటివరకు 1074 మంది మృతి చెందారని ఆయన వివరించారు. లారీ డ్రైవర్లకు స్క్రీనింట్ టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలను కోరినట్టుగా ఆయన తెలిపారు. 

గత 24 గంటల్లో 1718 కొత్త కేసులు నమోదయ్యాయన్నారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33 ,050చేరుకొందని చెప్పారు. 24 గంటల్లో 630 మంది కోలుకొన్నారన్నారు. ఇప్పటివరకు 8324 మంది ఈ వైరస్ నుండి కోలుకొని ఇంటికి చేరుకొన్నారని ఆయన తెలిపారు. 

గత 11 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు కావడం 11 రోజులకు తగ్గిపోయిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా సోకిన రోగుల రికవరీ రేటు 25 శాతానికి పైగా ఉందని ఆయన వివరించారు.కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కరోనా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాలను కోరుతున్నట్టుగా ఆయన చెప్పారు.

click me!