కరోనా ఎఫెక్ట్: బొమ్మను చూపి పోలీసులకు విశాఖ యువ జంట బురిడీ, షాకిచ్చిన కానిస్టేబుల్

By narsimha lodeFirst Published Apr 30, 2020, 2:43 PM IST
Highlights

లాక్‌డౌన్ నేపథ్యంలో తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఓ జంట చక్కటి ప్లాన్ వేశారు. బొమ్మను బిడ్డగా చూపి పోలీసులను బురిడి కొట్టించారు. చివరకు ఓ పోలీసుకు అనుమానం రావడంతో ఈ జంట బండారం బయటపడింది.


విశాఖపట్టణం: లాక్‌డౌన్ నేపథ్యంలో తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఓ జంట చక్కటి ప్లాన్ వేశారు. బొమ్మను బిడ్డగా చూపి పోలీసులను బురిడి కొట్టించారు. చివరకు ఓ పోలీసుకు అనుమానం రావడంతో ఈ జంట బండారం బయటపడింది. చివరికి పోలీసులు వారికి చీవాట్లు పెట్టారు. ఈ ఘటన విశాఖపట్టణంలో చోటు చేసుకొంది.

లాక్‌డౌన్ నేపథ్యంలో బయటకు కాలు పెట్టాలంటే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఓ జంట తమ బంధువుల ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులకు చిక్కకుండా బంధువుల ఇంటికి చేరుకోవాలని ప్లాన్ చేశారు.

బుధవారం నాడు ఉదయం గోపాలపట్నం నుండి బైకుపై బయలుదేరారు. మధ్యలో ఉన్న చెక్‌పోస్టుల వద్ద పోలీసులు వీరిని ఆపారు. అయితే ఆ యువతి బొమ్మను చంటిపిల్లను ఎత్తుకొన్నట్టుగా బైక్ పై కూర్చొంది. తన పిల్లాడికి అనారోగ్యంగా ఉందని ఆసుపత్రికి వెళ్తున్నట్టుగా పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు వారిని చెక్ పోస్టుల వద్ద వదిలేశారు.

also read:కర్నూల్ మున్సిపల్ కమిషనర్‌గా ఐఎఎస్ అధికారి బాలాజీ నియామకం, రవీంద్రపై బదిలీ వేటు...

ఇలా కొన్ని చెక్ పోస్టులను దాటుకొంటూ న్యాడ్ జంక్షన్ వద్దకు చేరుకొన్నారు. ఇక్కడ కూడ చిన్నారికి ఆరోగ్యం బాగా లేదని ఆసుపత్రికి వెళ్తున్నట్టుగా పోలీసులను నమ్మించారు. అయితే ఇక్కడ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ కు అనుమానం వచ్చింది. పిల్లాడిని చూపాలని కోరాడు. తీరా చూస్తే పోలీసులు షాక్ తిన్నారు. బొమ్మను టవాల్ లో చుట్టుకొని పిల్లాడిగా నమ్మించారని గుర్తించారు.

దీంతో పోలీసులు ఆ జంటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బంధువులకు అనారోగ్యంగా ఉండడంతో తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చిందని ఆ దంపతులు చెప్పారు. తమకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకొన్నారు. ఎట్టకేలకు పోలీసులు వారికి అనుమతి ఇచ్చారు.

click me!