
సీఎం సీటు సాధించడం కోసం జగన్ ఎంత దారుణానికైన దిగజారుతారని ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావ్. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు పై ఇంత నీచమైన కామెంట్లు చేయ్యడం సోచనీయం అని పెర్కోన్నారు. అస్సలు జగన్ కు రాజకీయ నాయకుడి లక్షణాలు లేవని, ప్రధాన ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యల గురించి కనీసం ఆలోచన లేదని ఆయన ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు ఆయన మనస్థత్వాన్ని ప్రతిరూపమని ఆయన విమర్శించారు. గతంలో రాయలసీమలో పదవుల కోసం ఎరుకలి కులస్థులను చంపిందే తమ వాళ్లేనని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనతో వాపోయాడని కళా వెంకట్రావ్ టుర్తు చేశారు. జగన్ కారణంగా ఐఎఎస్ అధికారుల జీవితాలు సర్వనాశనం అయ్యావని, జగన్ పేరు పరిటాల రవి హత్య కేసులో ప్రపంచానికి తెలిసిందని ఆయన పెర్కోన్నారు.
జగన్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, తక్షణమే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ మంత్రి కళా వెంకట్రావ్ డిమాండ్ చేశారు.