రోజా ప్రచారంలో టిడిపి అలజడి ?

Published : Aug 05, 2017, 02:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
రోజా ప్రచారంలో టిడిపి అలజడి ?

సారాంశం

నంద్యాలలో వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డికి మద్దతుగా నంద్యాల మున్సిపాలిటీలోని 16వ వార్డులో రోజా శనివారం ఉదయం ప్రచారం చేస్తున్నారు. ఇంతలో హటాత్తుగా వందల సంఖ్యలో మహిళలు వచ్చి గోల చేయటం మొదలుపెట్టారు.

వైసీపీ ఎంఎల్ఏ రోజా ప్రచారంలో టిడిపి అలజడి రేపింది. నంద్యాలలో వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డికి మద్దతుగా నంద్యాల మున్సిపాలిటీలోని 16వ వార్డులో రోజా శనివారం ఉదయం ప్రచారం చేస్తున్నారు. ఇంతలో హటాత్తుగా వందల సంఖ్యలో మహిళలు వచ్చి గోల చేయటం మొదలుపెట్టారు. ఎక్కడి నుండి వచ్చారో, ఎందుకు వచ్చారో కూడా వైసీపీ నేతలకు అర్ధం కాలేదు.

అయితే, వచ్చిన మహిళ్ళల్లోని కొందరిని వైసీపీ శ్రేణులు గుర్తించగలిగారు. వారిని పట్టుకుని మెల్లిగా ఆరాతీయగా టిడిపి వాళ్లు డబ్బులిచ్చి రోజా ప్రచారానికి అంతరాయం కలిగించమని తమను పంపారని బయటపెట్టారు. దాంతో ప్రచారం సందర్భంగా పెద్ద గొడవైంది. ఇంతలో అక్కడికి పోలీసులు చేరుకుని టిడిపి పంపగా వచ్చిన జనాలను చెదరగొట్టారు. సరే, ఇంతలోనే ఇరువర్గాల మధ్య తోపులాటలైతే జరిగిందనుకోండి అది వేరే సంగతి. మొత్తం మీద కొద్దిసేపు ప్రచారం జరుగుతున్న 16వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

PREV
click me!

Recommended Stories

Palle Panduga: గ్రామాల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.11,085 కోట్ల పనులకు శ్రీకారం
ఉదయగిరిలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Palle Panduga 3.0 | Pawan Kalyan | Asianet News Telugu