
సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైసీపి, టీడీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ జరిగింది. జగన్ చేసిన కామెంట్ ‘ముఖ్యమంత్రి చంద్రబాబును కాల్చినా తప్పు లేదంటు’ అనే విమర్శకు రెండు రోజులుగా ఆంధ్ర ప్రాంతం అంతా పెద్ద దుమారం జరుగుతుంది. ధర్నాకు దిగారు. జగన్ వాఖ్యలకు నిరసనగా కుప్పంలో ధర్నా నిర్వ హించిన టీడీపీ శ్రేణులు, ఆర్టీసీ బస్టాండు కూడలిలో జగన్ దిష్టిబొమ్మను దహనం చే శారు. జగన్ పై అక్కడి నాయకులు పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలిచ్చారు. ఈ నిరసనలో కుప్పం జడ్పీటీసీ రాజ్ కుమార్, వ్యవసాయ మార్కెట్టు కమిటీ మాజీ ఛైర్మన్ సత్యేంద్రశేఖర్ పాల్గోన్నారు.
టిడిపి శ్రేణులు జగన్ పై పలు ఆరోపణలు చేశారు. అనంతరం టిడిపి నాయకులు ప్రజలను హత్యలకు ప్రేరేపించే వ్యాఖ్యలు చేసిన జగన్‌ను హత్యానేరంపై అరెస్టు చేయాలంటూ కుప్పం ఎస్‌ఐ లోకేశ్ కు వినతిపత్రం సమర్పించారు. వీరు స్టేషన్ లో ఉండగానే వైసీపీ మండల కన్వీనర్ వెంకటేశ్‌బాబుతో కొందరు ఆ పార్టీ కార్యకర్తలు ఆర్టీసీ కూడలివద్దనున్న వైఎస్ విగ్రహం వద్దకు వచ్చి సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించారు.
అప్పుడే విషయం తెలిసి అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులు కూడా వైసీపి నేతల ప్రయత్నాన్ని ఆపడానికి ట్రై చేశారు. ఈ ప్రయత్నాల్లో టీడీపీ, వైసీపీ నాయకులమధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఇద్దరినీ విడదీయడానికి పోలీసులు ప్రయత్నించే సమయంలో రాజ్‌కుమార్, వెంకటేశ్ బాబులమధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అందులో ఇరు వర్గీయులు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు పార్టీల శ్రేణులను తమ లాఠీలతో చెల్లాచెదురు చేశారు.
అనంతరం పోలీసులు ఇరు వర్గాలను అదుపు లోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.