కాపు కోటా గల్లంతు: ఈబీసీ కోటాపై జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు

By telugu teamFirst Published Jul 29, 2019, 1:25 PM IST
Highlights

గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన హామీకి జగన్ ప్రభుత్వం గండి కొట్టింది. ఈబీసీ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే, దాని ప్రస్తావనేమీ లేకుండా జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి: ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈబీసీలకు) కేంద్రం కల్పించిన పది శాతం రిజర్వేషన్ల అమలుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ఆ రిజర్వేషన్ల అమలుకు మాత్రమే ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఉద్యోగాలు, ఇతర సేవల్లో అమలుకు మరో ఉత్తర్వు జారీ చేసే అవకాశం ఉంది. 

ప్రస్తుతం షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, ఇతర వెనకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తాజా పది శాతం రిజర్వేషన్లు వాటికి అదనం.  ఈ రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకుంటాయి. అయితే, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే గత ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. 

ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 జనవరిలో పచ్చ జెండా ఊపిదంది. ప్రస్తుత యాభై శాతం కోటాకు ఆ పదిశాతం రిజర్వేషన్ల కోటాను జత చేస్తూ రాజ్యాంగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సవరించింది. 

ఈ స్థితిలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈబీసీ కోటాను రాష్ట్రంలో అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. గతంలో చంద్రబాబు ఈబీసీ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఆ ఐదు శాతం రిజర్వేషన్లు వాటంతటవే రద్దవుతాయి. అయితే, ప్రస్తుతం కాపులు అగ్రవర్ణాల కిందికి వస్తున్నందున ఈ పది శాతం రిజర్వేషన్లలో వారు ప్రయోజనం పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

కాపులకు ద్రోహం చేసిందెవరో మీకు తెలీదా.. జ్యోతుల నెహ్రూ కి విజయసాయి పంచ్

కాపులకు ద్రోహం చేసిందెవరో మీకు తెలీదా.. జ్యోతుల నెహ్రూ కి విజయసాయి పంచ్

కాపు రిజర్వేషన్ల సెగ: ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన జగన్

నోటికి ప్లాస్టర్ వేసుకుంటా: జగన్‌కు ముద్రగడ ఘాటు లేఖ

కాపు రిజర్వేషన్లు: చంద్రబాబు చేతికి జగన్ ఆస్త్రం

కాపు రిజర్వేషన్... సీఎం జగన్ పై చినరాజప్ప విమర్శలు

మేమంటే ఎందుకంత కసి: జగన్‌పై జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు

కాపు రిజర్వేషన్లపై జగన్ ఫోకస్: కాపు నేతలతో భేటీ

కాపు కోటా: చంద్రబాబుకు వైఎస్ జగన్ కౌంటర్ వ్యూహం

click me!