టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూములివే: అసెంబ్లీలో బయటపెట్టిన మంత్రి బుగ్గన

By narsimha lode  |  First Published Jan 20, 2020, 1:23 PM IST

ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన పలువురు టీడీపీ నేతల పేర్లను సోమవారం నాడు ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి  ప్రకటించారు. 


అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూముల సేకరణలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకొందని  ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అప్పటి సీఎం చంద్రబాబునాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలకు , వారికి సంబంధించిన వారికి భూములు ఉన్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

also read:తెలంగాణ పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతోనే....: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

Latest Videos

సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో  సీఆర్‌డీఏ, పాలన వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ పేరున 14 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.

also read:ఆ రెండు బిల్లులకు వ్యతిరేకించాలి: రాపాక వరప్రసాద్‌కు పవన్ లేఖ

Also read:పవన్‌కు షాక్: జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

చంద్రబాబునాయుడుతో పాటు  చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన పరిటాల సునీతకు చెందిన కుటుంబసభ్యుల పేరు మీద భూములు ఉన్నాయని మంత్రి చెప్పారు.  పరిటాల సిద్దార్థ్,   పరిటాల సునీత అల్లుడు పేర్ల మీద   భూములు ఉన్నాయని  మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.

ఇది బ్లాక్ డే, అమరావతిని నిలుపుకొంటాం: చంద్రబాబు కామెంట్స్

చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితంగా  ఉన్న వేమూరి ప్రసాద్,  మాజీ ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, జీవీఎస్ ఆంజనేయులుకు భూములు కొనుగోలు చేశారని చెప్పారు.  జీవీఎస్ ఆంజనేయులు కుటుంబానికి  సుమారు 40 ఎకరాల భూములు ఉన్నాయన్నారు.  పరిటాల సునీత కుటుంబానికి   ధరణికోట, బలుసుపాడులో , నెమలికల్లు గ్రామాల్లో  భూములు కొనుగోలు చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

లింగమనేని రమేష్‌కు కూడ మంగళగిరి, కాజా తదితర ప్రాంతాల్లో భూములు కోనుగోలు చేశారన్నారు. మరో వైపు టీడీపీ మాజీ  అధికార ప్రతినిధి లంక దినకర్‌కు కూడ భూములు ఉన్నాయన్నారు. పయ్యావుల విక్రమ్ సింహా పేరుతో ఐనవోలులో భూములు ఉన్నాయన్నారు.

కంభంపాటి రామ్మోహన్ రావు కుటుంబానికి నంబూరులో భూములు కొనుగోలు చేశారన్నారు. పుట్టా మహేష్ యాదవ్ తాడికొండలో భూములు కొనుగోలు చేశారన్నారు. పుట్టా మహేష్ యాదవ్ మాజీ టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ కు చెందినవారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.దూళిపాల నరేంద్ర కుటుంబానికి చెందిన వీర వైష్ణవి పేరున భూములు కొనుగోలు చేశారన్నారు.   

మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ కు కూడ పోతూరు, పిచ్చుకలపాలెం గ్రామాల్లో భూములను కొనుగోలు చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. వేమూరి రవిప్రసాద్ మాజీ మంత్రి నారా లోకేష్ బినామీ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.అనంతపురం జిల్లాకు చెందిన  మాజీ మంత్రి పల్లె రఘునాథ్  రెడ్డి, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కూడ భూములు ఉన్నాయన్నారు. 

అయితే ఈ సమయంలో మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి  తనకు రాజధాని ప్రాంతంలో భూములు ఉన్న విషయాన్ని నిరూపించాలని డిమాండ్ చేశారు. తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 

ఈ తరుణంలో  బినామీలు భూములు కొనుగోలు చేశారో లేదో తేలుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.తమ భూముల నుండే రింగ్ రోడ్డును  తీసుకొచ్చారని మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడ బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.


 

click me!