ఏపీ అసెంబ్లీలో సీఆర్‌డీఏ రద్దు బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: తెలంగాణ లాంటి సమస్య రావొద్దంటే ఏపీలో వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణ కమిటీ సూచించిందని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు..సీఆర్‌డీఏ రద్దు బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లును మంత్రులు బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి, బొత్స సత్సనారాయణలు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
also read:ఆ రెండు బిల్లులకు వ్యతిరేకించాలి: రాపాక వరప్రసాద్‌కు పవన్ లేఖ
undefined
ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సుధీర్ఘంగా ప్రసంగించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ అంతకు ముందు చోటు చేసుకొన్న ఘటనలను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు.13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చేయాలని శివరామకృష్ణన్ కమిటీ చేసిన సూచనలను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also read:పవన్‌కు షాక్: జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక
ఏపీ రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తే చంద్రబాబునాయుడు వ్యాపారవేత్తలతో కమిటీని ఏర్పాటు చేసిన ట్టు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.
ఇది బ్లాక్ డే, అమరావతిని నిలుపుకొంటాం: చంద్రబాబు కామెంట్స్
రాజధానిని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే విషయమై శివరామకృష్ణ కమిటీ పర్యటిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణతో కమిటీని ఏర్పాటు చేశారన్నారు. శివరామకృష్ణ కమిటీ రిపోర్టును కనీసం చంద్రబాబునాయుడు అసెంబ్లీ ముందుకు కూడ తీసుకురాలేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
వ్యవసాయభూములకు ఇబ్బంది కల్గించకూడదని కూడ కమిటీ సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒకే పెద్ద సిటీ నిర్మాాణం కూడ సరికాదని కూడ శివరామకృష్ణ కమిటీ సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రస్తావించారు.
శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్టుగా ఉత్తరాం:ద్ర, రాయలసమీ వెనుకబడిందన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న ఉద్యమాల గురించి కూడ ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు.
శివరామకృష్ణ కమిటీ కూడ నిర్ధిష్టమైన నివేదిక ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వికేంద్రీకరణ ద్వారా సమగ్రాభివృద్ధి జరగాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు.
సమాన అభివృద్ధి లేకపోవడం వల్లే ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
వందేళ్ల చరిత్ర పరిశీలిస్తే అభివృద్ధి ముఖ్యమని తెలుస్తుందన్నారు. ఉపప్రాంతాల అభివృద్ధి జరగకపోతే ఉద్యమాలొస్లాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కోస్తాంధ్ర్, రాయలసీమకు పోలికే లేదన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో అభివృద్ధిలో చాలా వ్యత్యాసం ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ సందర్భంగా సభలో ప్రస్తావించారు.
ఉప ప్రాంతాలకు ప్రత్యేక అవసరాలు ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను
సమాన అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు.