దేశంలోనే అత్యంత ఖ‌రీదైనా ఎన్నిక‌ నంద్యాల‌

Published : Aug 23, 2017, 05:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
దేశంలోనే అత్యంత ఖ‌రీదైనా ఎన్నిక‌ నంద్యాల‌

సారాంశం

ప్రజాస్వామ్యాన్ని అసహాస్యం చేస్తున్న చంద్రబాబు. దేశంలోనే అత్యంత ఖరీదైనా ఎన్నికగా తయారు చేశారు. ఒక్క ఓటరుకు రూ. 5 వేల నుండి రూ.7 వరకు పంచారు. 

దేశంలో అత్యంత ఖ‌రీదైనా ఎన్నిక‌గా చంద్ర‌బాబు నంద్యాల ఉప ఎన్నిక‌ను త‌యారు చేశారని మండి పడ్డారు వైసీపి నేత అంబ‌టి రాంబాబు. టీడీపీ నేత‌లు ఓటు వెయ్య‌డానికి క్యూలో నిల‌బ‌డిన‌ ప్ర‌జ‌లకు కూడా డ‌బ్బులు పంచార‌ని ఆరోపించారు. ప్ర‌జాస్వామ్యం చంద్ర‌బాబు చేతులో అప‌హ‌స్యం అయిందిని అంబ‌టి మీడియా తో మాట్లాడుతూ విరుచుకుప‌డ్డారు.

నంద్యాల్లో ఓడిపోతే ప్ర‌భుత్వం ప‌డిపోతుంది... అనేలా టీడీపీ భ‌య‌ప‌డుతుంద‌న్నారు అంబ‌టి. ఆప్ట్రాల్ ఓ బై-ఎల‌క్ష‌న్‌కి వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఒక్క‌ ఓటుకు 5 నుండి 7 వేలు ఇవ్వ‌డం కేవ‌లం చంద్ర‌బాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు. పోలీసు అధికారులు కూడా ప‌చ్చ నేత‌లు చెప్పిన‌ట్లు వింటున్నారని ఆరోపించారు అంబ‌టి. టీడీపీ ప్ర‌భుత్వం అభివృద్ది ప‌నులు చేస్తే ప్ర‌జ‌లే గెలిపిస్తారని.. అని, రాష్ట్రాన్ని అభివృద్ది చేశాం అని చెప్పుకుంటున్న‌ చంద్ర‌బాబు ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.  

మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణ పై కూడా అంబ‌టి సెటైర్లు విసిరారు. కేంద్ర‌ ఎన్నిక‌ల క‌మీష‌న్ ఇచ్చిన ఆదేశాలపై మంత్రి మ‌రీ అతీ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. 
 

PREV
click me!

Recommended Stories

జగన్ ఇంటి ముందు నుంచే లోకేష్ మాస్ సవాల్ | Nara Lokesh At Tadepalli Palace | Asianet News Telugu
పాయకరావుపేట పాపమ్మ ట్రాక్ రికార్డ్ చూసుకో: YSRCP leader Shyamala on Home minister Anitha Vangalapudi