(వీడియోలు) నిబంధనలున్నవి ఉల్లంఘించటానికే...

First Published Aug 23, 2017, 3:29 PM IST
Highlights
  • నంద్యాల ఉపఎన్నికలో టిడిపి అన్నీ నిబంధనలనూ యధేచ్చగా ఉల్లంఘిస్తోంది.
  • ఓటింగ్ సరళి పెరగటంతోనే టిడిపిలో ఆందోళనలు మొదలయ్యాయి.
  • అందుకే అవకాశం ఉన్న ప్రతీ పోలింగ్ కేంద్రం వద్దా అరాచకాలకు దిగుతున్నారు
  • నేతలు. నిబంధనల ప్రకారం అభ్యర్ధితో పాటు ప్రధాన ఎన్నికల ఏజెంటు మాత్రమే పోలింగ్ బూత్ లోకి వెళ్ళగలరు.
  • కానీ ఉదయం నుండి టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి సోదరి భూమా మౌనిక యధేచ్చగా తన ఇష్టం వచ్చిన పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతున్నారు.

నంద్యాల ఉపఎన్నికలో టిడిపి అన్నీ నిబంధనలనూ యధేచ్చగా ఉల్లంఘిస్తోంది. ఓటింగ్ సరళి పెరగటంతోనే టిడిపిలో ఆందోళనలు మొదలయ్యాయి. అందుకే అవకాశం ఉన్న ప్రతీ పోలింగ్ కేంద్రం వద్దా అరాచకాలకు దిగుతున్నారు నేతలు. నిబంధనల ప్రకారం అభ్యర్ధితో పాటు ప్రధాన ఎన్నికల ఏజెంటు మాత్రమే పోలింగ్ బూత్ లోకి వెళ్ళగలరు. కానీ ఉదయం నుండి టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి సోదరి భూమా మౌనిక యధేచ్చగా తన ఇష్టం వచ్చిన పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతున్నారు.  అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు.

అదేవిధంగా మంత్రి భూమా అఖిలప్రియ కూడా అన్నీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ప్రచారం ముగిసిన రోజు అంటే సోమవారం సాయంత్రం 6 గంటల నుండి నంద్యాలలో స్ధానికేతరులు ఎవ్వరూ ఉండకూడదు. కానీ టిడిపి నేతలు ఎవ్వరూ నియమాన్ని పట్టించుకోలేదు. పోలీసులూ చూసీ చూడనట్లు వదిలేసారు. అయితే, అదే పోలీసులు వైసీపీ నేతల విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించారు. చివరకు అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు.

మంత్రి అఖిలప్రియ నిబంధనల ప్రకారం నంద్యాలను వదిలిపెట్టి వెళ్లిపోవాలి. కానీ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా నంద్యాలలోనే పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆళ్ళగడ్డ ఎంఎల్ఏ అయిన అఖిల నంద్యాలకు నాన్ లోకల్ అన్న సంగతి అందరికీ తెలిసిందే కదా? చివరకు పోలింగ్ రోజు కుడా నంద్యాలలోనే తిష్టవేసారు. టిడిపి నేతల వరస చూస్తుంటే నిబంధనలున్నవి ఉల్లంఘిచటానికే అన్నట్లుంది కదూ !

 

click me!