
పోలింగ్ సమయం ముగిసే సమయం దగ్గర పడే కొద్దీ నంద్యాలలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. 33వ వార్డులోని గాంధీనగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు టిడిపి నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలపై టిడిపి నేతలు విరుచుకుపడ్డారు. దాంతో ఇరువైపుల కార్యకర్తలు రోడ్డుపైనే కొట్టేసుకున్నారు. దాంతో భయపడిపోయిన ఓటర్లు అక్కడి నుండి పారిపోయారు. టిడిపికి కావల్సింది కూడా అదే. పోలింగ్ బూత్ లో ఉన్న ఓటర్లను ఓట్లు వేయనీయకుండా చేసేందుకు మధ్యహ్నం నుండి టిడిపి పలుచోట్ల అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే కదా? మీరే చూడండి ఎలా కొట్టుకుంటున్నారో?