సీఎం రమేష్ ఇంట్లో, కార్యాలయాల్లో ముగిసిన ఐటీ సోదాలు

By narsimha lodeFirst Published Oct 14, 2018, 12:41 PM IST
Highlights

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో మూడు రోజుల పాటు  ఐటీ అధికారుల సోదాలు ఆదివారం నాడు మధ్యాహ్నం ముగిశాయి.
 

హైదరాబాద్:టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో మూడు రోజుల పాటు  ఐటీ అధికారుల సోదాలు ఆదివారం నాడు మధ్యాహ్నం ముగిశాయి.

టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఇంట్లో , ఆయన కార్యాలయాల్లో  మూడు రోజుల నుండి ఐటీ అధికారులు  సోదాలు నిర్వహిస్తున్నారు.  ఆదివారం నాడు ఉదయం కూడ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఆదివారం మధ్యాహ్నం నాడు  ఐటీ అధికారుల సోదాలు  ముగిశాయి. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీ నుండి  కొన్ని  ఫైళ్లను స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం.

కొన్ని కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌లు,   ఫైళ్లను స్వాధీనం చేసుకొన్నట్టు తెలుస్తోంది.  హైద్రాబాద్, కడపలో కూడ ఈ సోదాలు నిర్వహించారు. సీఎం రమేష్‌కు చెందిన బంధువుల ఇళ్లలో కూడ సోదాలు జరిగాయి. అయితే ఉద్దేశపూర్వకంగానే  తమ ఇళ్లు, కార్యాలయాలపై  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు.

ఐటీ సోదాలు జరిగిన సమయంలో  సీఎం రమేష్ ఢిల్లీలోనే ఉన్నారు. శనివారం రాత్రి సీఎం రమేష్  హైద్రాబాద్‌కు తిరిగి వచ్చారు. కడప స్టీల్ ఫ్యాక్టరీపై ఉద్యమం చేసినందుకే  ఐటీ దాడులు నిర్వహించారని సీఎం రమేష్  ఆరోపించారు.

సంబంధిత వార్తలు

నాలుగేళ్లలో రూ.200కోట్లు చెల్లించా:సీఎం రమేష్

రెండో రోజూ ఐటి సోదాలు: వేలిముద్రల కోసం హైదరాబాద్ కు సిఎం రమేష్

click me!